Oats vs. White Rice: Which is Healthy?: ఓట్స్, వైట్ రైస్ ఏది ఆరోగ్యకరమైనది?

ABN , First Publish Date - 2022-09-10T17:16:53+05:30 IST

ఈ ఓట్స్ ను ప్లెయిన్ గా పాలతో కలుపుకొని తీసుకోవడమే కాకుండా రచికరంగా చాలా పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు.

Oats vs. White Rice: Which is Healthy?: ఓట్స్, వైట్ రైస్ ఏది ఆరోగ్యకరమైనది?

మన ఆహారంలో తృణధాన్యాలను తీసుకోవడం అలవాటుగా మారింది. ప్రస్తుత రోజుల్లో ఓట్స్ ను తక్షణమే బలాన్నిచ్చే ఆహారంగా అంతా ఇష్టపడుతున్నారు. మధుమేహం ఉన్నవారు ముఖ్యంగా ఓట్స్ ను ఆహారంలో కలిపి తీసుకుంటున్నారు. భారతీయులు ముఖ్యంగా తీసుకునే ఆహార పదార్థాలలో వైట్ రైస్ ఒకటి. ప్రాంతాలను బట్టి మన ఆహారంలో ఎక్కువగా అన్నాన్ని ఎక్కువగా తింటూ ఉంటాం. ఇది ఆరోగ్యాన్ని ఇచ్చే విషయం పక్కన పెడితే కడుపును నిండుగా ఉంచుతుంది. 


బియ్యం, గోధుమలానే ఓట్స్ తృణధాన్యం. ఇది తీసుకోవడం వల్ల శరీరంలోని అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ ను తొలగిస్తుంది. ఈ ఓట్స్ ను ప్లెయిన్ గా పాలతో కలుపుకొని తీసుకోవడమే కాకుండా రచికరంగా చాలా పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. ఇంకా ఉడికించిన ఓట్స్ కు కొంచెం నిమ్మరసాన్ని కలిపి ఉల్లిపాయలు, పర్చిమిచ్చి, పల్లీపొడితో సలాడ్ లా చేసుకుని సాయంత్రాలు తీసుకున్నా చక్కగా ఉంటుంది. 


వైట్ రైస్, ఓట్స్ లాగా, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం. వైట్ రైస్ లో 100 గ్రాములకు 130 కేలరీలను ఇస్తుంది, అయితే 100 గ్రాముల ఓట్స్ లో 389 కేలరీ మాత్రమే ఉంటాయి, రెండికీ 19% తేడా ఉంది.


ఓట్స్‌లో థయామిన్, రైబోఫ్లావిన్, పాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ బి6 స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.


ఓట్స్‌లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.


డైటరీ ఫైబర్, ఐరన్, పొటాషియం, ప్రొటీన్లు అన్నీ ఓట్స్‌లో అధిక స్థాయిలో ఉంటాయి.


నిజానికి, వైట్ రైస్‌లో ఓట్ కంటే 20.3% తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి. మరి ఈ ఓట్స్ తో ఎన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. చూద్దాం.


ఆపిల్-ఓట్స్ పోర్డ్జ్: ఐరన్, మినిరల్స్ వంటి వాటికి ఆపిల్ మంచి ఫ్రూట్. కాబట్టి, ఈ రెండింటి కాంబినేషన్ లో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం బోర్ లేకుండా ఉంటుంది.


ఓట్స్ విత్ లెమన్: డయాబెటిక్ వారైతే, ఓట్స్ తో నిమ్మరసం కొద్దిగా తేనె కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు.


ఓట్ మీల్ సూప్:  జ్వరం నుండి త్వరగా కోలుకోవాలనుకున్నప్పుడు, ఓట్ మీల్ సూప్ తీసుకోవడం మంచిది. దీనిని వెజిటేబుల్, చికెన్ బొర్త్(చికెన్ సూప్) ను తయారుచేసి, ఆ సూప్ లో ఓట్స్ ఉడికించి తీసుకోవచ్చు. 


ఓట్స్ విట్ డ్రై ఫ్రూట్స్: నట్స్ ఎనర్జీన్ బ్రెయిన్ పవర్ ను పెంచుతాయి . కాబట్టి, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, ఫిగ్స్ వేసుకొని తీసుకొంటే, మంచి ఎనర్జీ వస్తుంది.


ఓట్స్ ఫ్రూట్ సలాడ్: ఓట్స్ పాటు ఆరోగ్యకరమైన పండ్లను సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మరింత రుచికరంగా ఉండి శరీరానికి పూర్తి న్యూట్రిషియన్స్ అందుతాయి.


ఓట్స్ దోస: దోస సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ . దీన్ని బియ్యంపిండితో తయారుచేస్తారు. బియ్యం పిండికి బదులుగా, ఓట్స్ ఉపయోగించి తయారుచేసుకొనే దోసెలు లోక్యాలరీ తో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


ఓట్స్ కిచిడి: కిచిడి, బియ్యం, పప్పులతో తయారుచేస్తారు. బియ్యనికి బదులుగా ఓట్స్ తో తయారు చేస్తే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది.

Updated Date - 2022-09-10T17:16:53+05:30 IST