పెళ్లైన ఏడాది నుంచీ వరుసగా గర్భస్రావాలు జరుగుతున్నాయి.. లోపం ఎవరిది?

ABN , First Publish Date - 2022-03-17T16:57:58+05:30 IST

డాక్టర్‌! నా వయసు 30. పెళ్లై ఇప్పటికి మూడేళ్లు. పెళ్లైన ఏడాది నుంచీ వరుసగా గర్భస్రావాలు జరుగుతున్నాయి.

పెళ్లైన ఏడాది నుంచీ వరుసగా గర్భస్రావాలు జరుగుతున్నాయి.. లోపం ఎవరిది?

ఆంధ్రజ్యోతి(17-03-2022)

ప్రశ్న: డాక్టర్‌! నా వయసు 30. పెళ్లై ఇప్పటికి మూడేళ్లు. పెళ్లైన ఏడాది నుంచీ వరుసగా గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? లోపం నాలో ఉందా లేక మా వారిలో ఉందా? ఈ సమస్యకు యునానిలో పరిష్కారం దొరుకుతుందా?  


-  ఓ సోదరి, గూడూరు.


డాక్టర్ సమాధానం: గర్భస్రావం జరగడానికి లెక్కలేనన్ని కారణాలుంటాయి. దంపతుల్లో ఏ ఒక్కరిలో లోపమున్నా, గర్భం నిలవకపోవచ్చు. అయితే గర్భస్రావం ఏ ట్రైమెస్టర్‌లో జరుగుతోంది అనేదీ కీలకమే! మీకు మొదటి త్రైమాసికంలో గర్భస్రావం జరుగుతుంటే, అందుకు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ప్రధాన కారణం. కాబట్టి ఆ ఇన్‌ఫెక్షన్లను తగ్గించే చికిత్సతో పాటు రక్తం, బైల్‌లలో అసమానతలను సరిదిద్దే మందులు కూడా వాడుకోవలసి ఉంటుంది. ఒకవేళ రెండవ త్రైమాసికంలో గర్భస్రావం జరుగుతూ ఉంటే, గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉందని అర్థం చేసుకుని, సర్విక్స్‌ దగ్గర కుట్టు (సర్‌క్లాజ్‌) వేయవలసి ఉంటుంది. ఇలా కారణాన్ని కనిపెట్టి చికిత్స చేయడంతో పాటు, గర్భధారణకు ముందు నుంచీ, గర్భం దాల్చిన కొన్ని నెలల వరకూ యునాని మందులు వాడుకోవాలి.

పురుషుల్లో లోపాలుగర్భస్రావానికి కారణం పురుషుల వీర్యంలో కూడా ఉండవచ్చు. సెమన్‌ అనాలసిస్‌ చేయించి, మార్ఫాలజీ, కౌంట్‌లను పరీక్షించాలి. కొందరు పురుషుల్లో నెక్రోస్పెర్మియా అనే సమస్య ఉంటుంది. వీరి వీర్యకణాలు పూర్తిగా ఎదగని స్థితిలోనే అండాలతో ఫలదీకరం చెందడం వల్ల కూడా గర్భధారణ జరిగినా, గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. మరికొందరు పురుషుల్లో వీర్యకణాల డిఎన్‌ఎలో లోపాలు ఉంటాయి. వీటిని సరిదిద్దే చికిత్సలు కూడా యునానిలో ఉన్నాయి. మందులను వాడుకోవడంతో పాటు యునాని ప్రొటీన్‌ పౌడర్లు, పాలు, నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి. ఇలా అబార్షన్‌కు కారణం ఎవరిలో ఉందో కనిపెట్టి, చికిత్స తీసుకోవడం ద్వారా వరుస గర్భస్రావాలకు అడ్డుకట్ట వేసి, పండంటి బిడ్డలను కనవచ్చు.


డాక్టర్‌ షాజహానా

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,

యునాని టిబ్బి కాలేజి,

చార్మినార్‌, హైదరాబాద్‌.

Read more