ఒత్తిడిని తగ్గించుకోవాలంటే..

ABN , First Publish Date - 2022-10-27T06:08:27+05:30 IST

ఇంట్లో గృహిణులైనా, యువత అయినా ఒత్తిడికి లోనవడం సహజం.

ఒత్తిడిని తగ్గించుకోవాలంటే..

ఇంట్లో గృహిణులైనా, యువత అయినా ఒత్తిడికి లోనవడం సహజం. ముఖ్యంగా ఇంటికే అధికంగా పరిమితమయ్యే మహిళలల్లో ఒత్తిడి శాతం అధికంగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు కొన్ని టిప్స్‌ పాటిస్తే సరి ఒత్తిడి తగ్గిపోతుంది.

యువతలో మానసిక ఒత్తిడి, నీరసంగా ఉండటం, కాన్సన్‌ట్రేషన్‌ తగ్గిపోవడం లాంటివి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఫుడ్‌ తీసుకోవడంతో పాటు సరైన నిద్రలేకపోవడమే దీనికి కారణం. ఈ రోజుల్లో డిజిటల్‌ పొల్యూషన్‌కి ఎవరైనా గురవుతున్నారు. చేతిలో ఫోనుంటే చాలు.. గంటలు గంటలు గడిపితే తెలీని నీరసం వస్తుంది. అసహనం వస్తుంది. సోమరితనం ఆవహిస్తుంది. దీనివల్లే ఒత్తిడి అధికమవుతుంది. ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో ఉంటే ఎమోషన్స్‌ నియంత్రించడం కష్టం. అనవసరమైన నెగటివ్‌ ఎమోషన్స్‌కి దూరంగా ఉండాలంటే ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండాలి. కనీసం వారానికి ఒకసారైనా పాటించాలి. సోషల్‌ మీడియాకి దూరంగా ఉండటం కూడా ఉపశమనమే.

ఎక్కువ సమయం ఇంట్లో వారితో లేదా ఆత్మీయులతో మాట్లాడటం వల్ల స్ర్టెస్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. లోపల ఉండే ఒంటరితనం, అసూయ, ద్వేష భావాలు తగ్గిపోతాయి. దీని వల్ల త్వరగా రీచార్జ్‌ అవుతారు. ఇష్టమైన వ్యక్తులతో, కొత్త ప్రదేశాలకు వెళ్లటం వల్ల కూడా ఒత్తిడి తగ్గిపోతుంది. దీంతో పాటు నిజాయితీగా ఉండటం, ఐడియల్‌గా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇక ఇల్లు, స్నేహితులు, ఆఫీసు, ఎంజాయ్‌మెంట్‌.. ఇలా వేటికవి వేరువేరుగా ఉంచి జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవటం వల్ల కూడా ఒత్తిడి తగ్గిపోతుంది.

ఎలాంటి పని చేస్తే హ్యాపీగా ఉంటుందో.. ఎలాంటి విషయాల పట్ల ఒత్తిడి ఉందో మీరే లిస్ట్‌ అవుట్‌ చేసుకోవాలి. దీన్ని బట్టి ప్రవర్తించడం వల్ల మానసికంగా మీ భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు. స్ర్టెస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ తెలుసుకోవటం కూడా ఓ కళే. దీని వల్ల మీరు మీకే కొత్తగా అగుపిస్తారు. కొత్త విషయాలు తెలుసుకోవడం, డిఫరెంట్‌ పనులు చేయటం కొందరికి ఇష్టం. అలా చేసినపుడు ఒత్తిడి దరి చేరదు. ఎవరికి వాళ్లకి సెల్ఫ్‌లవ్‌ ఉంటే మంచిది. నీకు నువ్వే బహుమతి ఇచ్చుకోగలగాలి. కంపారిజన్స్‌ వదిలేయాలి. అప్పుడే నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది.

Updated Date - 2022-10-27T06:08:27+05:30 IST
Read more