Common Foods : ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తింటే విషమేనట..

ABN , First Publish Date - 2022-09-13T13:38:54+05:30 IST

ఫుడ్ పాయిజనింగ్ విషయానికి వస్తే, చికెన్ పూర్తిగా వండకపోయినా, కొన్నింటిని అతిగా తీసుకున్నా విషపూరితంగా మారే అవకాశాలున్నాయి.

Common Foods : ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తింటే విషమేనట..

ఫుడ్ పాయిజనింగ్ విషయానికి వస్తే, చికెన్ పూర్తిగా వండకపోయినా, కొన్నింటిని అతిగా తీసుకున్నా విషపూరితంగా మారే అవకాశాలున్నాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలు సహజంగానే టాక్సిన్‌లను కలిగి ఉంటాయి, అలాంటప్పుడు వాటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల హాని కలుగుతుంది. కింది ఆహారాలలో దేనినైనా తినేప్పుడు వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. లేదంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


బాదంAlmonds

బాదం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం. దీనిని మన రోజువారి అల్పాహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి చేదు బాదంపప్పులో గ్లైకోసైడ్ అమిగ్డాలిన్ అనే టాక్సిన్ ఉంటుంది, ఇది తిన్నప్పుడు సైనైడ్‌తో సహా అనేక రసాయనాలుగా విడిపోతుంది. 50 కంటే ఎక్కువ అడవి, పచ్చి చేదు బాదంపప్పులను తీసుకోవడం వల్ల ప్రాణాంతకం కావచ్చు. మామూలుగా మనం వంటలలో, తినడానికి ఉపయోగించే బాదం ఎక్కువ తీసుకున్నా ప్రమాదం కాదు.


అక్కీ Akki

అకీ అనేది జమైకాలో ఒక ప్రసిద్ధ ఆహారం, ఈ పండు అక్కడ ఎక్కువగా తింటూ ఉంటారు అలాగే సాంప్రదాయకంగా దీనిని సాల్ట్ ఫిష్, సాల్టెడ్ పోర్క్‌లతో వడ్డిస్తారు. అయితే ఇందులోని హైపోగ్లైసిన్ స్థాయిలు అధికంగా ఉండటం కారణంగా FDAచే నిషేధించింది. హైపోగ్లైసిన్ అనేది సహజంగా లభించే అమైనో ఆమ్లం, ఇది ఎక్కువగా తీసుకుంటే శరీరం విషపూరితమవుతుంది. 


లిమా బీన్స్ Lima Beans

కాసావా లానే, లిమా బీన్స్ కూడా విషపూరితమైన ఆమ్లాలను కలిగి ఉంటుంది. లిమా బీన్స్ (బటర్ బీన్స్ అని కూడా పిలుస్తారు) కూరలలో ఎక్కువగా వాడే లీమా గింజలను నీటిలో ఉడకబెట్టడం,24 నుండి 48 గంటల పాటు నానబెట్టడం వల్ల ఇవి తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించవచ్చు.


తేనెHoney

తేనెటీగలు ఉత్పత్తి చేసే తేనె కొన్నిసార్లు విషపూరిత మొక్కల నుండి తయారు కావచ్చు. విషపూరితమై పుష్పించే పూవుల నుంచి వచ్చిన తేనెలో ఆ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే, తేనె గణనీయమైన స్థాయిలో విషపదార్థాలతో తయారవుతుంది. నాణ్యమైన తేనె విషయంలో ఈ అభద్రతా భావం అవసరం లేదు.


జాజికాయ Nutmeg జాజికాయ మన వంటకాలలో మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం. కానీ రెండు, మూడు టీస్పూన్ల జాజికాయ పొడిని తీసుకోవడం ప్రమాదకరం. జాజికాయలో మిరిస్టిసిన్ అనే పదార్ధం ఉంటుంది, ఇది మసాలా నూనెలో కనిపించే సైకోయాక్టివ్ డ్రగ్. మిరిస్టిసిన్‌తో పాటు, జాజికాయలో మరో సైకోయాక్టివ్ పదార్ధమైన ఎలిమిసిన్ కూడా ఉంటుంది. రెండూ తీసుకున్నప్పుడు, మిరిస్టిసిన్, లిమిసిన్ కలిసి మరింత శక్తివంతమై భ్రాంతులు, తలతిరగడం, వాంతులు వంటి అనారోగ్యాలు కలుగుతాయి.


బంగాళదుంపలు Potatoes

బంగాళదుంపలు లేని ప్రపంచంలో జీవించడాన్ని ఊహించగలరా? ఫ్రెంచ్ ఫ్రైస్, లోడ్ చేసిన సూప్, గార్లిక్ మాష్, టాటర్ టోట్స్ ఫుడ్ గా వండుకుంటాం. కానీ బంగాళాదుంపలు ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే వెంటనే వాటిని వాడకపోవడమే మంచిది. ఈ బంగాళదుంపలు క్లోరోఫిల్ తో ఆకుపచ్చగా మారతాయి. ఇది విషపూరితమైన సోలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఇది జ్వరం, వాంతులు, విరేచనాలు కలిగిస్తుంది.


చెర్రీ Cherry

చెర్రీ పిట్ తినడం వల్ల రేగు, ఆప్రికాట్లు, మామిడి పండ్లలాగానే, నెక్టరైన్‌లు గింజలతో ఉంటుంది. ఇవి తినడం ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ గింజలను నమలడం, మింగేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. 

Read more