గుండె ఆరోగ్యం పదిలం

ABN , First Publish Date - 2022-10-27T06:04:13+05:30 IST

సిట్రస్‌ పండ్లు చలికాలం తినటం ఉత్తమం.

గుండె ఆరోగ్యం పదిలం

సిట్రస్‌ పండ్లు చలికాలం తినటం ఉత్తమం. ముఖ్యంగా నారింజ పండు తినటం లేదా జ్యూస్‌ రూపంలో తీసుకోవటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటంటే..

ఈ పండులో విటమిన్‌-సి పుష్కలం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అదే సమయంలో దగ్గు, ఇతర చిన్నపాటి ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. దీంతో పాటు చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగమైన పండు ఇది. హెయిర్‌ ప్యాక్‌ వేసుకుంటే జుట్టు ఆరోగ్యానికి మేలు.

బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉదయాన్నే నారింజరసం తాగాలి. ఈ సిట్రిక్‌ ఫ్రూట్‌ వల్ల ఎనర్జీగా ఫీలవుతారు.

ఫ్యాషన్‌ ఇండస్ర్టీలో ఉండేవాళ్లు, సెలబ్రిటీలు ఆరెంజ్‌ జ్యూస్‌ని ఇష్టపడుతుంటారు. ఇందులోని ఫ్రీరాడికల్స్‌ వల్ల స్కిన్‌ డ్యామేజ్‌ తగ్గిపోతుంది. యంగ్‌లుక్‌లో కనిపిస్తారు.

విటమిన్‌ బి6 ఉండటం వల్ల హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. దీంతో పాటు ఇందులోని మాంగనీసు వల్ల బ్లడ్‌ ప్రెషర్‌ నియంత్రించవచ్చు. రక్తప్రసరణ సాఫీగా జరగటం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం.

కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పండ్లు, ఎముకలకు బలాన్ని ఇవ్వటంతో పాటు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు పోగొడుతుంది.

ఈ పండు తినటం లేదా రసం తాగటం వల్ల తిన్న ఆహారపదార్థం సులువుగా జీర్ణమవుతుంది. ఆ విధంగా జీర్ణప్రక్రియను సాఫీగా ఉండేట్లు చేస్తుంది.

సాధ్యమైనంత వరకూ జ్యూస్‌ రూపంలో కాకుండా పండుని తింటే మరింత లాభం చేకూరుతుంది. ముఖ్యంగా తాజా పండ్లని ఎంపిక చేసుకోవటం ఉత్తమం.

Updated Date - 2022-10-27T06:04:14+05:30 IST