చెవిలో హోరు

ABN , First Publish Date - 2022-10-27T06:14:42+05:30 IST

డాక్టర్‌! నాకు చెవిలో శబ్దాలు మొదలయ్యాయి. వాటితో ప్రశాంతమైన జీవితం గడపలేకపోతున్నాను.

చెవిలో హోరు

డాక్టర్‌! నాకు చెవిలో శబ్దాలు మొదలయ్యాయి. వాటితో ప్రశాంతమైన జీవితం గడపలేకపోతున్నాను. ఈ సమస్యకు కారణాలు, చికిత్సల గురించి వివరించండి.

- ఓ సోదరుడు, హైదరాబాద్‌.

పేపర్‌ నలుపుతున్నట్టు, గంట మోగిస్తున్నట్టు, టక్కు టక్కుమని కొడుతున్నట్టు, సముద్రపు హోరులాగా, ష్‌...అని, గుయ్‌మని....ఇలా చెవిలో రకరకాల శబ్దాలు వినిపిస్తే అది కచ్చితంగా చెవి సమస్యే! దీన్నే వైద్య పరిభాషలో ‘టిన్నిటస్‌’ అంటారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు...ఎవరికైనా ఏ వయసులోనైనా ఈ సమస్య రావొచ్చు. టిన్నిట్‌సకు చెవిలోని వేర్వేరు ప్రదేశాల్లో తలెత్తే సమస్యలే కారణం. కొందరికి వెలుపలి చెవి, మధ్య చెవిలో సమస్యలుండవచ్చు. ఇలాంటి టిన్నిటస్‌ ‘కండక్టివ్‌ డెఫ్‌నెస్‌’ కోవ కిందకు వస్తుంది. కొందరికి లోపలి చెవిలో సమస్య ఉండొచ్చు. ఇది చెవి లోపలి నరానికి సంబంధించిన ‘నర్వ్‌ డెఫ్‌నెస్‌’ సమస్య. ఈ రెండు సమస్యల్లో చెవిలో శబ్దాలు వినిపిస్తాయి. వీటికి కారణాలు...

వ్యాక్స్‌ పేరుకుపోవటం

మధ్య చెవిలో ద్రవం చేరుకోవటం (సర్వసాధారణం, పిల్లల్లో ఎక్కువ) ఆటైటిస్‌ మీడియా విత్‌ ఎఫ్యూజన్‌

మధ్య చెవిలో నీరు లేదా చిక్కని జెల్లీలాంటి పదార్ధం చేరుకోవటం (పెద్దల్లో ఎక్కువ) మిడిల్‌ ఇయర్‌ విత్‌ ఎఫ్యూజన్‌

కర్ణభేరి వెనక ఉండే మూడిట్లోని ఒక ఎముక కదలకుండా ఉండిపోయినప్పుడు (10 నుంచి 80 సం/ల వయస్సులో) (వంశపారంపర్యంగా) మహిళల్లో ఎక్కువ. ఓటోస్క్లిరోసిస్‌

స్టిరాయిడ్స్‌, యాంటిబయాటిక్స్‌ దుష్ప్రభావాలు

కేన్సర్‌లో ఇచ్చే కీమోథెరపీ, రేడియో థెరపీ సైడ్‌ ఎఫెక్ట్‌

మేనరికపు వివాహాలు

గర్భిణిగా ఉన్న సమయంలో రూబెల్లా ఇన్‌ఫెక్షన్‌

శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేయటం వల్ల కర్ణభేరికి రంథ్రమై చీము చేరటం (అక్యూట్‌ సెపురేటివ్‌ ఆటైటిస్‌ మీడియా)

ఓరల్‌ డయూరిటిక్స్‌ వాడకం

పెద్ద శబ్దాలు

క్యాన్సర్‌ గడ్డలు

కర్ణభేరి వెనక చర్మపు తిత్తి ఏర్పడటం (కొలిస్టియొటోమా)

దవడ జాయింట్‌ ప్రాబ్లమ్‌ (టెంపరో మాండిబ్యులార్‌ జాయుంట్‌ డిస్‌ఫంక్షన్‌)

మెదడు వాపు, గవద బిళ్లలు

పుట్టిన వెంటనే ఇంటెన్సివ్‌ కేర్‌లో ఎక్కువ సమయం ఉన్న పిల్లలు

చికిత్స

కారణం మీదే చెవి చికిత్సలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి పలు రకాల పరీక్షలతో మూల కారణాన్ని కనిపెట్టి, చికిత్సను ఎంచుకోవలసి ఉంటుంది. చెవిలో ఎటువంటి శబ్దాలు మొదలైనా, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.

డాక్టర్‌.ఎన్‌.విష్ణు ఎస్‌ రెడ్డి,ఛీఫ్‌ కన్సల్టెంట్‌ ఈఎన్‌టి సర్జన్‌,హైదరాబాద్‌.

Updated Date - 2022-10-27T06:14:42+05:30 IST
Read more