Pearl Millet Benefits: ఆరోగ్యాన్ని ఇచ్చే సజ్జలు పోషకాలతో నిండిన ఈ ముత్యం మిల్లెట్ గురించి... తెలుసా?

ABN , First Publish Date - 2022-09-19T21:37:41+05:30 IST

ఆరోగ్యం మీద కాస్త అవగాహన ఉన్నా వాళ్ళకు తప్పకుండా మిల్లెట్స్ గురించి తెలిసే తీరుతుంది. ఈ మిల్లెట్స్ చేసే మేలు మాటల్లో చెప్పలేనిది.

Pearl Millet Benefits: ఆరోగ్యాన్ని ఇచ్చే సజ్జలు పోషకాలతో నిండిన ఈ ముత్యం మిల్లెట్ గురించి... తెలుసా?

Pearl Millet Benefits: సజ్జలు జావ, అన్నం, రొట్టె ఇవన్నీ ఇప్పుడు తెలియనివారంటూ లేరు. ఆరోగ్యం మీద కాస్త అవగాహన ఉన్నా వాళ్ళకు తప్పకుండా మిల్లెట్స్ గురించి తెలిసే తీరుతుంది. ఈ మిల్లెట్స్ చేసే మేలు మాటల్లో చెప్పలేనిది. పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరూ సాధారణంగా తినే ఆహారంలో మిల్లెట్స్ అదే చిరుధాన్యాలు ఉండేవి. కాలం గడుస్తున్న కొద్దీ చిరుధాన్యాల స్థానంలో ధాన్యం తో వండిన అన్నం, గోధుమలతో చేసిన రొట్టె ఇవే ఆహారాలుగా తీసుకుంటున్నారు. 


1. ఈమధ్య కాలంలో అందరిలో ఆరోగ్యం మీద పెరిగిన అవగాహన, కాస్త జాగ్రత్త వల్ల మళ్ళీ తిరిగి చిరుధాన్యాలను తినడం మొదలు పెట్టారు. 


2. అందులో ముఖ్యంగా సజ్జలు, కొర్రలు, గంట్లు ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యం బావుంటుందనే నమ్మకంతో సజ్జలను అదే ఆకారంలో ముత్యాన్ని పోలి ఉండే వీటిని తినడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా స్థూలకాయాన్ని తగ్గించే లక్షణం కూడా ఇందులో ఉంది. 


3. చలికాలంలో సజ్జలను తీసుకోవడం వల్ల వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు వల్ల మెటబాలిజం బాగా జరిగి స్థూలకాయం రావడం తగ్గుతుంది. 


4. జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, చర్మ కణాలను వృద్ధి చేయడంలోను సజ్జలు మంచి పాత్ర పోషిస్తాయి. ఇందులోని ఐరెన్ శరీరంలోని ఐరెన్ లోపాన్ని సరిచేస్తుంది. 


5. నిపుణుల అభిప్రాయం ప్రకారం మిల్లెట్ లో అత్యధికంగా పైబర్ ఉంటుంది. ఇది నిరంతరం తీసుకోవడం వల్ల కొలస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. 


6. సజ్జల్లో మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి. పైగా మెగ్నీషియం హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గిస్తుంది.


7. ఈ సజ్జల్లో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. దాంతో ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. పోర్షన్ కంట్రోల్ వల్ల వెయిట్ గెయిన్ చేయకుండా ఉంటారు.


8. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల దీన్ని డయాబెటీస్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటారు. సజ్జలు గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచకుండా ఉంచుతాయి.


9. సజ్జల్లో ఉండే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ప్రీబయాటిక్ లా పని చేసి, డైజెస్టివ్ హెల్ ని రెగ్యులేట్ చేస్తుంది.

Updated Date - 2022-09-19T21:37:41+05:30 IST