అల్లంతో లాభాలెన్నో...!
ABN , First Publish Date - 2022-06-30T17:59:12+05:30 IST
మనకు అందుబాటులో ఉండే అద్భుతమైన న్యాచురల్ రెమిడీ అల్లం. మనదేశంలో దొరికే ట్రెడిషనల్ మెడిసిన్ ఇదే.

మనకు అందుబాటులో ఉండే అద్భుతమైన న్యాచురల్ రెమిడీ అల్లం. మనదేశంలో దొరికే ట్రెడిషనల్ మెడిసిన్ ఇదే.
- ఇది పసుపు జాతికి చెందినది. అప్పుడే మట్టిలోంచి తీసిన అల్లం దుంపలో 79 శాతం నీళ్లు, 18శాతం కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. దగ్గు, జలుబు ఉన్నప్పుడు అల్లం టీ తాగుతుంటారు. అప్పుడు చక్కని ఉపశమనం కలుగుతుంది.
- రక్తంలోని చక్కెర శాతాన్ని అల్లం తగ్గిస్తుంది. కొలెస్ర్టాల్‌ను తగ్గించే గుణం దీనికి ఉంది. దీనివల్ల గుండెసమస్యలు రావు.
- మినరల్స్, బి3,బి6, సి-విటమిన్, పాస్ఫరస్, జింక్, పొటాషియం, ఐరన్.. ఇలా 400కి పైగా ఉపయోగకరమైన కాంపౌండ్స్ అల్లంలో ఉంటాయి. ముఖ్యంగా శరీరంలోని కండరాల నొప్పిని అల్లం తగ్గిస్తుంది. కీళ్లనొప్పుల సమస్యను తగ్గించటానికి ఇది ఉపయోగపడుతుంది.
- నోటిలో ఉండే బ్యాక్టీరియా, వైర్‌సలను తరిమికొట్టే శక్తి దీనికి ఉంది. ముఖ్యంగా వాంతులను నివారించే గుణం అల్లంకు ఉంది. ఈ విషయం కొన్ని పరిశోధనల్లో తేలింది. జీర్ణం సాఫీగా జరుగుతుంది. అలాగని రోజూ తీసుకుంటే మాత్రం ఇబ్బందే.. కడుపులో మంట పుడుతుంది.
- ఆస్తమాను కంట్రోల్ చేయగలదు. మొత్తానికి వ్యాధి నిరోధక శక్తిని అల్లం పెంచుతుంది.