పళ్లు కలిసిన నీళ్లు తాగితే..

ABN , First Publish Date - 2022-09-22T20:59:33+05:30 IST

పళ్లు కలిసిన నీళ్లు తాగితే బడలిక తొలిగి, కొత్త ఉత్తేజం దక్కుతుంది. వేసవి తాపం, దాహం తీరడంతోపాటు ఉపశమనాన్ని అందించే ఈ హెల్తీ డ్రింక్‌ ఇలా తయారు చేసుకోవాలి.

పళ్లు కలిసిన నీళ్లు తాగితే..

పళ్లు కలిసిన నీళ్లు తాగితే బడలిక తొలిగి, కొత్త ఉత్తేజం దక్కుతుంది. వేసవి తాపం, దాహం తీరడంతోపాటు ఉపశమనాన్ని అందించే ఈ హెల్తీ డ్రింక్‌ ఇలా తయారు చేసుకోవాలి.


కావలసిన పదార్థాలు:

  • స్ట్రాబెర్రీలు - 4
  • నిమ్మకాయ - 1
  • నీళ్లు - 4 గ్లాసులు
  • తులసి ఆకులు - 5
  • తేనె - 1 టేబుల్‌ స్పూను

తయారీ విధానం:

  • స్ట్రాబెర్రీలు శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి పెట్టుకోవాలి.
  • నిమ్మకాయ చక్రాలుగా కోసుకోవాలి.
  • వెడల్పాటి గిన్నెలో నీళ్లు నింపి, స్ట్రాబెర్రీ ముక్కలు, తేనె, తులసి ఆకులు వేసి కలపాలి.
  • ఈ గిన్నెను ఫ్రిజ్‌లో 3 గంటల నుంచి 2 రోజుల వరకూ ఉంచి వాడుకోవచ్చు.

Read more