-
-
Home » Navya » Health Tips » Can eating chocolate reduce cholesterol ssd-MRGS-Navya
-
Dark Chocolate For Cholesterol: చాక్లెట్ తిని కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా?
ABN , First Publish Date - 2022-09-11T15:31:17+05:30 IST
ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.

అధిక కొలెస్ట్రాల్ జన్యుపరమైన సమస్య అయినప్పటికీ ఇది జీవనశైలి మీద ఆధారపడి ఉంటుది. ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. అయితే కొలస్ట్రాల్ తగ్గించుకునే మార్గంలో డార్క్ చాక్లెట్ తినడం కూడా ఒక మార్గం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కోకో పౌడర్ తీసుకోవడం వల్ల కోకోలో ఉండే పాలీఫెనాల్స్, ప్లేవనాయిడ్స్ ఉండటంం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి.
మన శరీరంలో ఉండే మొత్తం కొలెస్ట్రాల్ 200 నుంచి 239 mg/dL మధ్య ఉంటే, అది సాధారణంగా సమానంగా ఉన్నట్టుగా పరిగణిస్తాం. అదే 240 mg/dL కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువగా పరిగణిస్తాం. కానీ LDL కొలెస్ట్రాల్ 130, 159 mg/dL మధ్య ఉంటే, అది సాధారణంగా సమంగా ఉన్నట్టే..
డార్క్ చాక్లెట్ కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గిస్తుంది?
కనీసం 70%డార్క్ చాక్లెట్ లోని కోకో డెరివోటివ్లలో అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలోనూ, రక్తపోటును, చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయ పడతాయి. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యానికి రక్షణను ఇస్తుంది.
మీ ఆహారంలో డార్క్ చాక్లెట్‌ని ఉపయోగించండి:
ఒక కప్పు బాదం పాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కోకో పౌడర్‌తో కలపండి. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి క్రీమ్, కొన్ని చుక్కల స్టెవియా, ,మాంక్ ఫ్రూట్ కలపండి. దానికి బెల్లం లేదా తేనె కలిపితే మంచి రుచిగా ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు సైతం దీనిని తీసుకోవచ్చు.
చాక్లెట్ కన్నా కోకో పౌడర్ ఉపయోగించడం మంచిది, ఎందుకంటే ఇందులో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కోకో పౌడర్ మిశ్రమం ప్రతి రోజు లేదా వారానికి రెండుసార్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.