lettuce benefits: మెదడు, గుండె ఆరోగ్యాన్ని పెంచె పాలకూర.. ముసలితనాన్ని వాయిదా వేస్తుందా?
ABN , First Publish Date - 2022-08-27T15:24:35+05:30 IST
తోటకూర, పాల కూర, మెంతి కూర ఇలాంటి ఆకుకూరల్లో సహజంగానే చాలా పోషకాలు ఉన్నాయి.
పాలకూరను తరచుగా మనం ఇళ్ళల్లో వాడుతూనే ఉంటాం. పాలకూరను పప్పుతో కలిపి, కూరగా చేసి తీసుకుంటాం. తోటకూర, పాల కూర, మెంతి కూర ఇలాంటి ఆకుకూరల్లో సహజంగానే చాలా పోషకాలు ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే. అయితే పాలకూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల అది మన శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందనేది తెలుసుకుందాం.
1. మెదడును చురుగ్గా ఉంచడంలో పాలకూర సహకరిస్తుంది. మానసిక సమస్యలను తగ్గిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
2. పాలకూరలో కొలెస్ట్రాల్ ఉండదు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు, ఆస్థియోడైనియా లను తగ్గిస్తుంది. ఎక్కువగా బరువు తగ్గాలనుకునే వారికి పాలకూర చక్కగా ఉపయోగపడుతుంది.
3. గర్భంతో ఉన్న స్త్రీలకు పాలకూర తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి, ఎ, మెగ్నిషియం, పోలిక్ యాసిడ్లు, క్యాన్సర్ ను నిరోధించడంలో సహాయం చేస్తాయి.
4. అంతేకాదు పాలకూరను ఎక్కువగా తీసుకునే వారిలో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు.
5. ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ముసలితనాన్ని వాయిదా వేయడంలో సహకరిస్తుంది. ముఖం పై ముడతలు రానీయకుండా చేస్తుంది. శరీరంలో ఉండే చెడు వ్యర్థాల్ని బయటకు పంపడంలో కూడా పాలకూరను మించిన పదార్థం మరొకటి లేదు.
6. రక్తహీనతతో బాధపడేవారు పాలకూర తినడంవల్ల ఈ సమస్య నుంచి సులువుగా బయటపడచ్చు.