-
-
Home » Navya » Health Tips » Blood cancer is not a death sentence Here are 10 questions to ask your doctor after a cancer diagnosis ssd-MRGS-Navya
-
Blood Cancer Treatment: బ్లడ్ క్యాన్సర్ అంటే మరణ శిక్ష కాదు. క్యాన్సర్ నిర్ధారణ తర్వాత డాక్టర్‌ని అడగాల్సిన 10 ప్రశ్నలు ఇవే..
ABN , First Publish Date - 2022-09-20T17:15:34+05:30 IST
వయస్సు, లింగ బేధంతో సంబంధం లేకుండా ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. రక్త క్యాన్సర్ మూడు రకాలుగా ఉంటుంది.

రక్త కణాలు, ఎముక మజ్జ, శోషరస వ్యవస్థ నుంచి రక్త క్యాన్సర్ పుడుతుంది. ఇది వయస్సు, లింగ బేధంతో సంబంధం లేకుండా ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. రక్త క్యాన్సర్ మూడు రకాలుగా ఉంటుంది. లుకేమియా, లింఫోమా, మైలోమా. రక్త క్యాన్సర్ చాలా భయంకరమైన వ్యాధి. అయితే ఒక వ్యక్తి తనకు క్యాన్సర్ అని తేలగానే డాక్టర్ ను ఈ పది ప్రశ్నలు అడగాలి.
1. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి?
ఎముక మజ్జ, శోషరస వ్యవస్థలో ఉద్భవించే క్యాన్సర్ లకు ఇది కాస్త భిన్నం. లుకేమియా, అక్యూట్/క్రానిక్, లింఫోమాస్- హాడ్‌కిన్స్/నాన్ హాడ్‌కిన్స్, మల్టిపుల్ మైలోమా ఇవి క్యాన్సర్ లలోని రకాలు.
2. రక్త క్యాన్సర్లకు చికిత్స ఉంటుందా?
రక్త క్యాన్సర్ కు చికిత్స చేయడమే కాకుండా, వయస్సు, దశ రకాన్ని బట్టి 50 నుంచి 80% కేసులలో వాటికి సమర్ధవంతంగా నయం చేయవచ్చు.
3. బ్లడ్ క్యాన్సర్ ను నివారించవచ్చా?
బ్లడ్ క్యాన్సర్ ను నిరోధించలేకపోయినా క్యాన్సర్ సంకేతాలను గురించి అవగాహన కల్పించడం ద్వారా రోగులకు ముందుగానే ధైర్యాన్ని ఇచ్చి చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తారు.
4. బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు సంకేతాలు ఏలా ఉంటాయి.
లింఫోమా, లుకేమియా మెడ, చంక లేదా గజ్జల్లో గడ్డలు ఏర్పడటం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు, ముఖం, మెడ వాపు, శ్వాస ఆడకపోవడం, కాలేయం, ప్లీహము పెరగడం, చిగుళ్ల వాపు, రక్తస్రావంతో జ్వరం రావడం జరుగుతుంది. మైలోమా అయితే రక్తహీనత, ఎముకల నొప్పి, ట్రివియల్ ట్రామాపై ఫ్రాక్చర్, కిడ్నీ సమస్యలు, అంటువ్యాధులు లక్షణాలుగా ఉంటాయి.
5. బ్లడ్ క్యాన్సర్ కు కారణాలు ఏమిటి?
రేడియేషన్, కీమోథెరపీ, బెంజీన్, టాక్సిన్స్,టానింగ్ ఉత్పత్రులు, పురుగుమందులకు దగ్గరగా మసలడం, ఇవన్నీ ప్రమాదకారకాలై డిఎన్ఏలో క్యాన్సర్ కణాలు రక్తక్యాన్సర్ కు దారితీస్తాయి.
6. రక్త క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా?
రక్త క్యాన్సర్ వారసత్వంగా సంక్రమించదు. ఇది అంటువ్యాధి కాదు. కుటుంబంలో ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సంక్రమించదు.
7. క్యాన్సర్ ఏవయసు వారికైనా వస్తుందా?
రావచ్చు. వృద్ధులలో ఇది సాధారణంగా కనిపించినప్పటికీ అన్ని వయసులవారికీ క్యాన్సర్ వస్తుంది. బాల్య దశలోనే 26% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
8. క్యాన్సర్ ని ఏలా నిర్ధారిస్తాం.
పెరిఫెరల్ స్మెర్, బోన్ మ్యారో స్టడీస్, ఫ్లోసైటోమెట్రీ లేదా ఇమ్యునోఫెనోటైపింగ్, క్రోమోజోమల్ స్టడీస్, మాలిక్యులర్ స్టడీస్, ఎక్సిషనల్ లింఫ్ నోడ్ బయాప్సీతో సహా CBC పూర్తి రక్త పరిక్షలతో రోగ నిర్ధారణ చేస్తారు.
9. లింఫోమా నిర్ధారణలో శోషరస నోడ్ FNAC పాత్ర ఏమిటి?
రోగ నిర్ధారణ చేయడంలో FNACపాత్ర లేదు. ఖచ్చితమైన రోగ నిర్ధారణ కోసం ఎక్సిషనలో లింఫ్ నోడ్ బయాప్సీ అవసరం.
10. బ్లడ్ క్యాన్సర్ దశ ఏమిటి?
బ్లడ్ క్యాన్సర్ ప్రమాద దశలుగా విభజించబడింది. PET CT, ఎముక మజ్జ అధారంగా లింఫోమాను చూస్తాము. మైలోమా అనేది రిస్క్ స్కోర్ లు, మూత్రపిండాల ప్రమేయం ఆధారంగా ఒక దశ మాత్రమే. క్యాన్సర్ వ్యాధి ఉన్నదని తేలాకా రోగికి ధైర్యం అవసరం. తనుకు కఠిన శిక్షపడినట్టుగా భయాందోళనలకు గురికావడం కన్నా ప్రశాంతంగా ఉండటమే చాలావరకూ మేలు చేస్తుంది. అనుక్షణం డాక్టర్ పర్యవేక్షణలో సలహాలను పాటిస్తూ చికిత్సకు సహకరించడం ద్వారా వ్యాధి తీవ్రత తగ్గుతుంది.