Menstrual Cups పై 9 అపోహలు.. అసలు నిజాలు.. దీన్ని వాడితే స్త్రీల కన్యత్వం పోతుందా..?

ABN , First Publish Date - 2022-07-18T21:38:24+05:30 IST

పిరియడ్స్ మీద ఆ సమయంలో ఉపయోగించే సాధనాల గురించి ఇంకా పూర్తి అవగాహన రావల్సి ఉంది. దీనిమీద కలిగే అపోహలను గురించి బహిరంగంగా చర్చించాలి.

Menstrual Cups పై 9 అపోహలు.. అసలు నిజాలు.. దీన్ని వాడితే స్త్రీల కన్యత్వం పోతుందా..?

ఓ సంస్థలో పనిచేసే విజయకు ప్రతి నెలా పిరియడ్స్ సమయంలో కడుపు నొప్పి కలిగించే అసౌకర్యాన్ని గురించి అటు ఇంట్లోనూ ఇటు ఆఫీస్ లో కొలిగ్స్ తోనూ పంచుకోవడానికి సిగ్గు, భయం ఓ అభద్రతా భావం. తన సమస్యను ఎందుకు ఎవరితో చెప్పుకోలేకపోతుంది. ఇలా తనే కాదు. విజయలాంటి ఎందరో.. స్త్రీలు వాళ్ళ రుతుసమస్యల గురించి మాట్లాడకపోవడం అనేది ఒక్క సిటీలలోనే కాదు. పల్లెల్లో కూడా దీనిమీద అవగాహన తక్కువే. 


డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న శ్రావణి (పేరు మార్చాం)కి నెలసరి సమస్య కొత్త కాదు, అదీ గాక తానుండేది హైదరాబాద్ మహానగరంలో. కానీ, రుతుసమస్య గురించి స్నేహితురాళ్లతో కూడా మాట్లాడలేదు, అదేదో తప్పు, తగని పని అన్నట్టు. మొన్నా మధ్య ఎవరో NGO తరఫున Menstrual Cups ఉచితంగా పంచుతుంటే తీసుకోవడానికి సిగ్గుపడిపోయింది. వాటికి సంబంధించి తన ఈడు అమ్మాయి హసీనా నిర్భయంగా అవగాహన కల్పిస్తూ మాట్లాడుతుంటే, అక్కడ నిల్చోవడానికి కూడా ఇబ్బంది పడిపోయింది. ఇది 20 ఏళ్ల శ్రావణి సమస్యే కాదు, ఐటీలో పదేళ్లుగా పనిచేస్తున్న పరిమళ వ్యవహారం కూడా ఇంతే. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా menstrual activism ఉధృతమౌతూ మహిళలు తమ హక్కుల గురించి నిర్భయంగా నినదిస్తుంటే, మరో పక్క మన దేశంలో విజయలాంటి వారు అధిక సంఖ్యలో ఉంటూనే ఉన్నారు. 


ముఖ్యంగా Menstrual Cup వాడడంలో చాలా అపోహలున్నాయి. వీటిని వాడటం వల్ల దద్దుర్లు రావు.. శానిటరీ ప్యాడ్‌లను తరచుగా మార్చే అవసరం ఉండదు. ప్యాడ్స్ పారవేయాల్సిన అవసరం తగ్గుతుంది.  ఇప్పుడిప్పుడే వాడకంలోకి వస్తున్న ఋతుస్రావ కప్పులు(Menstrual Cup) పర్యావరణ అనుకూలమైనవి, ఈ మెన్‌స్ట్రువల్ కప్‌ల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో, ఎర్నాకులం ఎంపీ హిబీ ఈడెన్ ‘కప్ ఆఫ్ లైఫ్’ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. 24 గంటల్లో తన నియోజకవర్గంలో లక్ష మందికి పైగా లబ్ధిదారులకు మెన్‌స్ట్రువల్ కప్పులను ఉచితంగా పంపిణీ చేశారు. 


ప్రతి స్త్రీ జీవితంలో యుక్తవయసుకు వచ్చారని ఆమెకు పిరియడ్స్ మొదలవుతూనే తెలుస్తుంది. ఈ సైకిల్ వృద్ధాప్యానికి వస్తున్నామనేంత వరకూ అంటే మోనోపాజ్ దశ ముగిసేవరకూ ఉంటుంది. నెల నెలా నిరంతర ప్రక్రియగా సాగే ఈ ఋతుక్రమం మొదటిసారి ఋతుక్రమం మొదలయినప్పటి నుండి మెనోపాజ్ వరకూ కూడా పూర్వ పద్దతుల్లోనే ఉండిపోతున్నాం. క్లాత్ వాడటం అలవాటైపోయిన తల్లి అదే బిడ్డకూ అలవాటు చేసింది. కాకపోతే కాలంతో పాటు కాస్త అవగాహన వచ్చిన స్త్రీ ఈ పిరియడ్స్ విషయంలో క్లాత్ స్థానంలో శానటరీ ప్యాడ్స్, టాంపాన్ వరకూ వచ్చారు. పిరియడ్స్ విషయంలో స్త్రీలలో ఉన్న చాలా అపోహలకు తగ్గట్టు కొత్తగా వాడుకలోకి వచ్చిన ఈ Menstrual Cup ధరించే విషయంలో కూడా అపోహలున్నాయి వాటికి సంబంధించిన టాప్ 9 విషయాలను తెలుసుకుందాం. 


1: ఒక సైజు అందరికీ సరిపోతుంది

Menstrual Cup ల విషయానికి వస్తే పరిమాణం(size) ముఖ్యం. అందుకే రకరకాల దశల కోసం ఈ కప్స్ మూడు వేర్వేరు పరిమాణాలలో వస్తున్నాయి:


మోడల్ 0: పీరియడ్స్ కొత్తగా మొదలైన వారికి లేదా 18 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.


మోడల్ 1: 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, మధ్యస్థంగా రుతుక్రమం వచ్చే వారికి ఇవి ఉపయోగంగా ఉంటాయి.


మోడల్ 2: 30 ఏళ్లు పైబడిన వారి నుంచి అధిక ఋతు ప్రవాహం కలిగి ఉన్నావారికి ఇవి పనికి వస్తాయి. అయితే, ఒకే వయసులోని వారందరికీ ఒక సైజే సరిపోతుందని కాదు. మెన్‌స్ట్రువల్ కప్‌ని ఎంచుకునేటప్పుడు సైజ్ ను ఎంచుకున్నప్పుడు అసౌకర్యంగా ఉందని, చాలా తేలికగా జారిపోయిందని లేదా లీక్‌గా ఉంటే, సరైన ఫిట్ నెస్ లేకపోవచ్చు. ముఖ్యంగా గురుతుంచుకోవలసిన విషయాలేంటంటే.. శరీర ఆకృతి, యోని పరిణామాన్ని నిర్ణయించదు. వయసు పెరిగే కొద్దీ యోని గోడలు రిలాక్స్ అవుతాయి. ఈ కారణాలవల్లే Menstrual Cup మూడు వేరు వేరు సైజ్ లలో దొరుకున్నాయి.


అపోహ 2: Virgin's Menstrual Cup ని ఉపయోగించలేరు.

లేదు, Virgin's Menstrual Cup ఉపయోగించడం వల్ల కన్యత్వాన్ని కోల్పోరు. కన్యగా ఉండటం అంటే ఏమిటనే దానిపై చాలా గందరగోళం ఉంది. ఎవరైనా నాన్-వర్జినల్ (Non-virginal) అయ్యే ఏకైక మార్గం లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే జరుగుతుంది.


అపోహ 3: Menstrual Cup ధరించేటప్పుడు వాష్‌రూమ్‌ని ఉపయోగించవచ్చా?

మూత్రవిసర్జన ముందు కప్‌ను తొలగించాల్సిన అవసరం లేదు. బాత్రూమ్‌ని ఉపయోగించడానికి కప్పును తీసేయవచ్చని మనకు తెలుసు. మూత్రాశయం సులభంగా ఖాళీ అయ్యేలా మూత్ర విసర్జన చేసినప్పుడు ముందుకు వంగి ఉండాల్సి రావచ్చు. ఇది మూత్రనాళంపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఏదైనా అసౌకర్యం అనిపిస్తే, మూత్ర విసర్జన చేయడానికి, మలవిసర్జన చేయడానికి ముందు Cupని తీసివేసి, ఆపై కడిగి మళ్లీ ఇన్సర్ట్(Insert) చేయాలి. 


అపోహ 4: ఒక Menstrual Cup యోని లోపల పోతుందా?

యోని లోపలకు Menstrual Cup పోదు. యోని లోపల 3-4 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది, ఇది గర్భాశయ ముఖద్వారం వరకు ఉంటుంది, ఇది మెన్స్ట్రువల్ కప్ గర్భాశయంలోకి వెళ్లకుండా చేస్తుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు కనెక్ట్ అవ్వదు కాబట్టి కప్ లోపలికి పోదు. సరిగ్గా ఉంచినప్పుడు, కప్పు స్థలం నుండి కదలకూడదు. చొప్పించడం, తీసివేయడం అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పట్టచ్చు. 


అపోహ 5: Menstrual Cup ధరించినప్పుడు నిద్రపోలేమా?

మీరు Menstrual Cup తో నిద్రపోవచ్చు. నిజానికి, స్థూలమైన ప్యాడ్‌లు లేదా టాంపాన్‌లతో పోలిస్తే, వీటిని ఎప్పుడూ 8 గంటల కంటే ఎక్కువ ధరించకూడదు, Menstrual Cup 12 గంటల వరకు లీక్-ఫ్రీ రక్షణను అందిస్తుంది. దీనివల్ల రాత్రి సౌకర్యవంతమైన విశ్రాంతి తీసుకోవచ్చు.


అపోహ 6: IUD(Intrauterine contraceptive device) ఉంటే Menstrual Cup ని వాడలేమా?

గర్భాశయ గర్భనిరోధక పరికరంతో ఒకే సమయంలో Cupని ఉపయోగించేలేమా? ముందు 3-6 నెలలు వేచి ఉండాలని వైద్యులు అంటున్నారు. 


అపోహ 7: అధిక పీరియడ్ ఉన్నవారు  Menstrual Cupని ఉపయోగించలేరా?

Menstrual Cup భారీ ప్రవాహానికి సురక్షితమైనది, ఎందుకంటే ఇది టాంపాన్‌లు, ప్యాడ్‌లతో పోలిస్తే ఎక్కువ ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. మొదటిసారిగా  Menstrual Cup వాడుతున్నవారిలో ఒక రకమైన ఇబ్బంది మొదలవవచ్చు. అస్తమానూ  Menstrual Cupని తొలగించి మళ్ళీ అమర్చుకోవడంలో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది. కాకపోతే ఇది టాంపాన్‌లు, ప్యాడ్‌లతో పోలిస్తే తక్కువే అంటున్నారు వైద్యులు. 


అపోహ 8: Menstrual Cup ధరించినప్పుడు వ్యాయామం చేయలేమా?

యాక్టివ్ గా ఉండే జీవనశైలికి Menstrual Cup గొప్ప ఎంపిక! ఈకప్‌తో ఈత కొట్టేటప్పుడు వ్యాయామ సమయంలో టాంపోన్ లాగా లీక్ అవ్వదు.. ఈత కొట్టేటప్పుడు స్ట్రింగ్, లీక్-ఫ్రీ రక్షణ ఇస్తుంది. 


అపోహ 9: Menstrual Cup లు అసౌకర్యంగా ఉంటాయా?

Menstrual Cup మెడికల్ గ్రేడ్ సిలికాన్‌తో తయారుచేస్తారు. డిస్పోజబుల్స్‌కు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయం. మెన్‌స్ట్రువల్ కప్‌లను కొత్తగా వాడుతున్నవారు మంచి ఫిట్ సౌకర్యాన్ని పొందడానికి మూడు నెలల వరకు సమయం పట్టవచ్చు.


పిరియడ్స్ మీద ఆ సమయంలో ఉపయోగించే సాధనాల గురించి ఇంకా పూర్తి అవగాహన రావల్సి ఉంది. దీనిమీద కలిగే అపోహలను గురించి బహిరంగంగా చర్చించాలి. పిరియడ్స్ సమయంలో సమస్యలపై ఎదురయ్యే చర్మసంబంధ సమస్యలను పరిష్కరించుకోవడం నుండి వాడే పాడ్స్ లేదా టాంపాన్ లు, Menstrual Cup వరకు అన్నిటి మీదా మంచి అవగాహన అవసరం. దీనితో ఆ రోజులు కూడా ఒత్తిడి లేకుండా గడిచిపోతాయంటున్నారు నిపుణులు. Read more