Skin Care : చలిలో చర్మం మర్మం

ABN , First Publish Date - 2022-11-01T23:32:34+05:30 IST

చలి కాలంలోకి అడుగు పెట్టేశాం. చల్లని గాలులతో చర్మం పొడిబారకుండా చూసుకోవాలి.

Skin Care : చలిలో చర్మం మర్మం
Winter skin care

చలి కాలంలోకి అడుగు పెట్టేశాం. చల్లని గాలులతో చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఈ కాలంలో చర్మం చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వింటర్‌ స్కిన్‌ కేర్‌ను అనుసరించాలి.

- మాయిశ్చరైజర్‌: చర్మం పొడిబారకుండా ఉండడం కోసం ఈ కాలంలో తప్పనిసరిగా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకుంటూ ఉండాలి. స్నానం చేసిన మూడు నిమిషాల్లోగా మాయిశ్చరైజర్‌ అప్లై చేస్తే, చర్మంలోకి ఇంకిపోయి చర్మం తేమగా ఉంటుంది. చల్లని గాలుల నుంచి రక్షణ దక్కుతుంది.

- సన్‌స్ర్కీన్‌: చలి కాలం సన్‌స్ర్కీన్‌తో పని లేదనుకుంటే పొరపాటు. ఈ కాలంలో కూడా తప్పనిసరిగా సన్‌స్ర్కీన్‌ అప్లై చేసుకోవాలి. అయితే మాయిశ్చరైజర్‌ అప్లై చేసిన తర్వాత, సన్‌స్ర్కీన్‌ పూసుకోవాలి.

- మాస్క్‌: చర్మానికి తేమనందించే ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే, చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. అయితే ఫేస్‌ మాస్క్‌లో నిమ్మ జాతి రసాలను ఉపయోగించకూడదు. నిమ్మ, టమాటాల్లాంటివి చర్మాన్ని పొడిబారుస్తాయి. కాబట్టి ముఖాన్ని తాజా వెన్నతో లేదా కొబ్బరినూనెతో మర్దన చేసి, తర్వాత ముల్తానా మట్టి, రోజ్‌వాటర్‌తో ప్యాక్‌ వేసుకోవాలి.

- నీళ్లు: చలికాలం దాహం తక్కువ. అలాగని సరిపడా నీళ్లు తాగకపోతే చర్మానికి సరిపడా తేమ అందదు. కాబట్టి ఈ కాలంలో కూడా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి.

Updated Date - 2022-11-01T23:32:37+05:30 IST