Russian ప్రభుత్వ మీడియా ఛానళ్లపై YouTube నిషేధాస్త్రం
ABN , First Publish Date - 2022-03-12T16:17:53+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా రష్యన్ ప్రభుత్వ మీడియా ఛానళ్లపై యూట్యూబ్ నిషేధాస్త్రం విధించింది...

వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా రష్యన్ ప్రభుత్వ మీడియా ఛానళ్లపై యూట్యూబ్ నిషేధాస్త్రం విధించింది.యూట్యూబ్ ఇప్పటికే యూరప్ అంతటా ఆర్టీ, స్పుత్నిక్ యొక్క ఛానెళ్లను బ్లాక్ చేసింది.అమెరికన్ ఆన్లైన్ వీడియో షేరింగ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా రష్యన్ ప్రభుత్వ నిధులతో నడుస్తున్న మీడియా ఛానెళ్లను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడికి సంబంధించిన కంటెంట్‌ను తొలగించారు. ‘‘మేం రష్యా అనుబంధ యూట్యూబ్ ఛానెళ్లను కూడా బ్లాక్ చేస్తున్నాం’’ అని యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి ప్రారంభించినప్పటి నుంచి యూట్యూబ్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.