అందరూ చూడవలసిన సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’ : మోదీ

ABN , First Publish Date - 2022-03-15T18:29:37+05:30 IST

కశ్మీర్ ఫైల్స్’ చలన చిత్రం అందరూ చూడదగినదని

అందరూ చూడవలసిన సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’ : మోదీ

న్యూఢిల్లీ : ‘కశ్మీర్ ఫైల్స్’ చలన చిత్రం అందరూ చూడదగినదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆ పార్టీ ఎంపీలను ఉద్దేశించి మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను చూడాలని చెప్పారు. ఇది చాలా మంది చిత్రమని, ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. 


‘‘కశ్మీర్ ఫైల్స్ చాలా మంది చలన చిత్రం. మీరంతా దీనిని చూడాలి. ఇటువంటి చిలన చిత్రాలు మరిన్ని రావాలి’’ అని మోదీ అన్నారు. ఈ సినిమా మార్చి 11న విడుదలైంది. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. 1990వ దశకంలో కశ్మీరు నుంచి హిందువులు వెళ్లిపోవడానికి దారి తీసిన పరిస్థితులను దీనిలో వివరించారు. 


Updated Date - 2022-03-15T18:29:37+05:30 IST