హోలీ సంబరాల్లో ముఖ్యమంత్రులు...జోష్ నింపిన రంగుల పండుగ

ABN , First Publish Date - 2022-03-18T13:28:36+05:30 IST

దేశవ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు జరిగాయి. రంగుల పండుగ సందర్భంగా ప్రజలు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు....

హోలీ సంబరాల్లో ముఖ్యమంత్రులు...జోష్ నింపిన రంగుల పండుగ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు జరిగాయి. రంగుల పండుగ సందర్భంగా ప్రజలు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన హోలీ వేడుకల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన హోలీకా దహన్ వేడుకల్లో పాల్గొన్న యోగి మాట్లాడుతూ సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని ఈ ఎన్నికలు చూపించాయన్నారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా గురువారం రాత్రి హోలీకి ముందు ఆచారాలు నిర్వహించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన ఇంటి వద్ద జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సతీమణి సాధనా సింగ్‌తో కలిసి భోపాల్‌లో జరిగిన హోలికా దహన్ సంబరాల్లో పాల్గొన్నారు.పంజాబ్‌లో ఆప్ గెలిచిన తర్వాత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా సంబరాలు చేసుకున్నారు.దేశవ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగను జరుపుకుంటున్నారు. జమ్మూలీ బీఎస్ఎఫ్ జవాన్లు హోలీ సందర్భంగా పాటలు పాడుతూ నృత్యం చేశారు.హోలికా దహన్ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది.ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సంప్రదాయ పూజల తర్వాత హోలీ వేడుకలు ప్రారంభం అయ్యాయి.

Read more