Selfie with Great Khali: గ్రేట్ ఖలీ చెంపదెబ్బ రుచి చూసిన టోల్ బూత్ వర్కర్‌!?

ABN , First Publish Date - 2022-07-12T22:19:30+05:30 IST

ప్రొఫెషనల్ రెజ్లర్ గ్రేట్ ఖలీ (Great Khali) ఓ టోల్ బూత్ ఉద్యోగితో

Selfie with Great Khali: గ్రేట్ ఖలీ చెంపదెబ్బ రుచి చూసిన టోల్ బూత్ వర్కర్‌!?

చండీగఢ్ : ప్రొఫెషనల్ రెజ్లర్ గ్రేట్ ఖలీ (Great Khali) ఓ టోల్ బూత్ ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కారులో వెళ్తుండగా పంజాబ్‌, జలంధర్ ప్రాంతంలోని ఫిలౌర్ వద్ద టోల్ బూత్‌ సిబ్బంది ఆయనను ఆపినట్లు తెలుస్తోంది. ఆయనను చూసిన ఓ ఉద్యోగి ఆయన కారులోకి దూసుకెళ్ళి, ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించినపుడు ఆయన ఆగ్రహంతో ఊగిపోయినట్లు చెప్తున్నారు. 


ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియోలో వీరిద్దరి ఘర్షణలో ఓ పోలీసు కానిస్టేబుల్ జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ‘‘నన్ను ఎందుకు కొట్టావు?’’ అని గ్రేట్ ఖలీని ఆ ఉద్యోగి పదే పదే  అడుగుతున్నట్లు కనిపిస్తోంది. 


కాసేపటి తర్వాత గ్రేట్ ఖలీ తన కారు నుంచి బయటకు వచ్చి, పోలీసు కానిస్టేబుల్‌తోనూ, ఆ ఉద్యోగితోనూ మాట్లాడారు. అనంతరం ఖలీ విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో, ‘‘నిన్న పంజాబ్‌లోని ఫిలౌర్‌లో ఉన్న టోల్ బూత్ ఉద్యోగి నా కారును ఆపి, సెల్ఫీ కోసం నాతో తప్పుగా ప్రవర్తించారు. నేను సెల్ఫీని తిరస్కరించడంతో దురుసుగా ప్రవర్తించారు. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దూషించారు’’ అని పేర్కొన్నారు. 


Read more