మొదటి ప్రపంచ యుద్ధం నాటి పేలే సామర్థ్యం ఉన్న బాంబును గుర్తించిన కుర్రాడు

ABN , First Publish Date - 2022-05-30T22:24:02+05:30 IST

యూకేలోని నార్తరన్ ఐర్లాండ్ బీచ్‌లో ఓ కుర్రాడు మొదటి ప్రపంచ యుద్ధం నాటి లైవ్ గ్రనేడ్‌ను గుర్తించాడు. కల్ట్రా బీచ్‌లో

మొదటి ప్రపంచ యుద్ధం నాటి పేలే సామర్థ్యం ఉన్న బాంబును గుర్తించిన కుర్రాడు

లండన్: యూకేలోని నార్తరన్ ఐర్లాండ్ బీచ్‌లో ఓ కుర్రాడు మొదటి ప్రపంచ యుద్ధం నాటి లైవ్ గ్రనేడ్‌ను గుర్తించాడు. కల్ట్రా బీచ్‌లో బాంబును గుర్తించిన తర్వాత ఆ కుర్రాడు తమను సంప్రదించినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆర్మీ టెక్నికల్ అధికారి దానిని పరీక్షించి.. అది మొదటి ప్రపంచ యుద్ధం నాటి ‘మిల్స్ బాంబ్’ హ్యాండ్ గ్రనేడ్ అని నిర్ధారించారు.


అనంతరం దానిని క్రాఫోర్డ్స్‌బర్న్ కౌంటీ పార్క్‌కు తరలించి సురక్షితంగా పేల్చివేసినట్టు సోషల్ మీడియా  పోస్టులు బట్టి తెలుస్తోంది. పేలే సామర్థ్యం ఉన్న ఆ బాంబును గుర్తించిన బాలుడికి పోలీసులు థ్యాంక్స్ చెప్పారు. మిల్స్ బాంబు తొలి హ్యాండ్ గ్రనేడ్‌. దీనిని 1915లో అభివృద్ధి చేశారు.  

Updated Date - 2022-05-30T22:24:02+05:30 IST