World record: త్రివర్ణ రంగోలితో ప్రపంచ రికార్డుకు యత్నం
ABN , First Publish Date - 2022-08-13T16:53:57+05:30 IST
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మింట్ వీధిలో ఉన్న లిటిల్ మిలీనియం స్కూలుకు చెందిన చి

- అబ్బురపరిచిన చిన్నారులు
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 12: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మింట్ వీధిలో ఉన్న లిటిల్ మిలీనియం స్కూలుకు చెందిన చిన్నారులు మూడు రంగుల ఇసుకతో త్రివర్ణపు రంగోలి(Rangoli) రూపొందించి ప్రపంచ రికార్డు సాధించారు. లిటిల్ మిలీనియం ఫ్రాంచైజీలు ఏకే గురుచరణ్, శరణ్యల అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు రంగుల ఇసుకతో 20 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో అందంగా 75వ స్వాతంత్య్ర(freedom) దినోత్సవానికి ఆహ్వానం పలికారు. 2నుంచి5 ఏళ్లలోపున్న 70 మంది చిన్నారులను డా. అబ్దుల్ కలాం వరల్డ్ రికార్డు నిర్వాహకులు అభినందించి సర్టిఫికెట్లు బహూకరించారు.