వ్యక్తిగత డేటా భద్రత బిల్లు ఉపసంహరణ

ABN , First Publish Date - 2022-08-04T10:59:32+05:30 IST

వ్యక్తిగత డేటా భద్రత బిల్లు-2019ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నుంచి ఉపసంహరించుకుంది.

వ్యక్తిగత డేటా భద్రత బిల్లు ఉపసంహరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 3: వ్యక్తిగత డేటా భద్రత బిల్లు-2019ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నుంచి ఉపసంహరించుకుంది. దాని స్థానంలో పటిష్టమైన కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు. బుధవారం ఆయన ఈ మేరకు లోక్‌సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వాయిస్‌ ఓటు ద్వారా ఆ బిల్లును ఉపసంహరించారు. 

Updated Date - 2022-08-04T10:59:32+05:30 IST