ప్రతి ఒక్కరికి ఆయుధాలిస్తాం: ఉక్రెయిన్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-02-24T21:50:29+05:30 IST

ప్రతి ఒక్కరికి ఆయుధాలిస్తాం: ఉక్రెయిన్ అధ్యక్షుడు

ప్రతి ఒక్కరికి ఆయుధాలిస్తాం: ఉక్రెయిన్ అధ్యక్షుడు

కీవ్: ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే ప్రతి ఒక్కరికి ఆయుధాలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కియి ప్రకటించారు. రష్యా దాడులతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్.. తమను తాము రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సైనికులతో పాటు పౌరులను కూడా యుద్ధ రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. రష్యా దూకుడు పసిగట్టి బుధవారమే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిన ఉక్రెయిన్.. గురువారం ఉదయం ప్రారంభమైన రష్యా దాడిని మాత్రం ఎదుర్కోలేకపోయింది. ‘‘దేశాన్ని కాపాడాలనుకునే ఎవరికైనా ఆయుధాలు ఇస్తాం. దేశంలోని నగరాలతో పాటు దేశ నలుమూలలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి’’ అని వోలోడిమిర్ జెలెన్‌స్కియి గురువారం ట్వీట్ చేశారు. కాగా, రష్యా ప్రారంభించిన యుద్ధంలో 40 మంది ఉక్రెయిన్ సైనికులు, 10 మంది ఉక్రెయిన్ పౌరులు, 50 మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వర్గాలు వెల్లడించాయి.

Read more