Weekend కర్ఫ్యూ కొనసాగించండి
ABN , First Publish Date - 2022-01-18T17:55:19+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమైక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వారాంతపు కర్ఫ్యూను మరికొంత కాలం కొనసాగించడంతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిపుణల కమిటీ ప్రభుత్వానికి

- మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలి
- ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫారసు
బెంగళూరు: రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమైక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వారాంతపు కర్ఫ్యూను మరికొంత కాలం కొనసాగించడంతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిపుణల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొవిడ్ సాంకేతిక సలహా కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ ఎంకె సుదర్శన్ సోమవారం తాజా స్థితిపై దాదాపు రెండు గంటల పాటు వర్చువల్ సమావేశం నిర్వహించారు. వీకెండ్ కర్ఫ్యూను ఫిబ్రవరి చివరి వరకు పొడిగించాలని, నైట్ కర్ఫ్యూను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. సంక్రాంతి పండుగకు ముందు నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన వైర స్ పండుగ అనంతరం గ్రామాలకు సైతం పాకే ప్రమాదకరమైన పరిస్థితి కనిపిస్తోందని నిపుణులు పేర్కొన్నట్లు సమాచారం. ఎక్కడికక్కడే వైరస్ను నియంత్రించేందుకు మరిన్ని క్లస్టర్లను, కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని, ఐటీబీటీ ఉద్యోగులు కనీసం మరో రెండు నెలలు ‘వర్క్ ఫ్రమ్ హోం’కు పరిమితమయ్యేలా సంబంధింత శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సుదర్శన్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కూడా పాల్గొన్నారు.