రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాలు పేల్చేస్తాం

ABN , First Publish Date - 2022-10-17T08:52:35+05:30 IST

రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాలను బాంబులతో పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు లేఖ ఉత్తరాఖండ్‌లో కలకలం రేపింది.

రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాలు పేల్చేస్తాం

ఉత్తరాఖండ్‌లో బెదిరింపు లేఖ కలకలం

హరిద్వార్‌, అక్టోబరు 16: రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాలను బాంబులతో పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు లేఖ ఉత్తరాఖండ్‌లో కలకలం రేపింది. కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌తో సహా పలు ప్రార్థనా మందిరాలు, రైల్వేస్టేషన్లపై దాడులు చేస్తామని పేర్కొంటూ హరిద్వార్‌ రైల్వేస్టేషన్‌కు లేఖ అందింది. దీంతో పోలీసులు, నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. సాధారణ పోస్టు ద్వారా పంపిన ఈ లేఖ ఈ నెల 10న అందిందని జీఆర్‌పీ ఏఎస్పీ అరుణ భారతి ఆదివారం తెలిపారు. జైష్‌-ఈ-మొహమ్మద్‌ ఏరియా కమాండర్‌ జమీర్‌ అహ్మద్‌ పేరిట ఈ లేఖ వచ్చిందని చెప్పారు. 

Updated Date - 2022-10-17T08:52:35+05:30 IST