ఉక్రెయిన్‌లో మళ్లీ యుద్ధం మొదలైంది

ABN , First Publish Date - 2022-03-06T02:43:43+05:30 IST

దాదాపు ఐదారు గంటల విరామం తర్వాత మళ్లీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం

ఉక్రెయిన్‌లో మళ్లీ యుద్ధం మొదలైంది

కీవ్: దాదాపు ఐదారు గంటల విరామం తర్వాత మళ్లీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైంది. పలు నగరాలపై రష్యా సేనలు భీకర దాడులకు దిగారు. కీవ్ సమీపంలోని గ్రామాలపై రష్యా వైమానిక దాడులు జరపడంతో చిన్నారులు సహా పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. వోల్నావోఖా నగరంపై క్షిపణులతో రష్యా దళాల దాడి చేశాయి. వోల్నావోఖా 90 శాతం నాశనమైందని స్థానిక ఎంపీ ప్రకటించారు. చెర్నివ్‌పై రష్యా దాడుల్లో  పదుల సంఖ్యలో మృతులు, వందల మందికి గాయపడినట్టు వార్తలు అందుతున్నాయి. చెర్నివ్‌లో క్షిపణి దాడికి 4 అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు, చెర్నివ్ సరిహద్దులో రష్యా విమానాన్ని ఉక్రెయిన్ కూల్చేసింది. రష్యా దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ దళాలు ఇప్పటివరకు 10 వేల మంది రష్యా సైనికులు హతమార్చినట్టు ప్రకటించాయి.

Updated Date - 2022-03-06T02:43:43+05:30 IST