3, 10న యూఎస్‌ వర్సిటీల వర్చువల్‌ ఫెయిర్స్‌

ABN , First Publish Date - 2022-08-31T09:38:40+05:30 IST

యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 3, 10 తేదీల్లో ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ వర్చువల్‌ ఫెయిర్స్‌ని నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశాల్లో వందకుపైగా అమెరికన్‌..

3, 10న యూఎస్‌ వర్సిటీల వర్చువల్‌ ఫెయిర్స్‌

యూజీ, పీజీ విద్యార్థుల కోసం నిర్వహణహైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 3, 10 తేదీల్లో ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ వర్చువల్‌ ఫెయిర్స్‌ని నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశాల్లో వందకుపైగా అమెరికన్‌ వర్సిటీలు, కాలేజీలు పాల్గొంటున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇందులో పాల్గొనవచ్చు. దీనికి ఫీజు లేదు. అయితే, రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. అమెరికాలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేయాలని అనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఆసక్తిగలవారు రిజిస్ట్రేషన్‌, ఇతర వివరాలకు https://bit.ly/EdUSAFair22EmbWeb,  https://www.facebook. com/EducationUSAIndia, https://educationusaindia@usief. org.in వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.

Read more