Vijaykanth ఆరోగ్యంపై వదంతులు ఆపండి
ABN , First Publish Date - 2022-07-05T15:12:50+05:30 IST
ప్రముఖ సినీనటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపింపజేయవద్దంటూ ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. విజయకాంత్ ఆరోగ్య

- డీఎండీకే విజ్ఞప్తి
చెన్నై, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపింపజేయవద్దంటూ ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు కొన్నివర్గాలు ప్రచారం చేస్తున్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పుకార్లు పుట్టించడం గర్హనీయమని పేర్కొంది. విజయకాంత్ ఆరోగ్యంపై అవాస్తవాలు ప్రచురించిన ఓ దినపత్రికపైనా, తప్పుడు వార్తలు ప్రసారం చేసిన టీవీ ఛానెళ్ళపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదివరకే ఆయన ఆరోగ్యంపై పుకార్లు వ్యాపింపజేసిన యూట్యూబ్ ఛానెళ్లపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఈ పుకార్లను పార్టీ శ్రేణులు నమ్మవద్దని డీఎండీకే విజ్ఞప్తి చేసింది.