రాహుల్‌పై వీడియో.. బీజేపీ ఎంపీలపై కేసు

ABN , First Publish Date - 2022-07-05T07:51:39+05:30 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సంబంధించి నకిలీ వీడియోను వైరల్‌ చేశారంటూ ఇద్దరు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.

రాహుల్‌పై వీడియో.. బీజేపీ ఎంపీలపై కేసు

న్యూఢిల్లీ, జూలై 4: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సంబంధించి నకిలీ వీడియోను వైరల్‌ చేశారంటూ ఇద్దరు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఛత్తీ్‌సగఢ్‌లోని బిలా్‌సపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఆ ఇద్దరు ఎంపీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్టు కాంగ్రెస్‌ పార్టీ మీడియా చీఫ్‌ పవన్‌ ఖెరా చెప్పారు. ‘‘మత ఘర్షణలు సృష్టించే లక్ష్యంతో రాహుల్‌గాంధీకి సంబంధించిన నకిలీ వీడియోను బీజేపీ ఎంపీలు రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, సుబ్రత్‌ పాఠక్‌లు వైరల్‌ చేశారు’’ అని పవన్‌ అన్నారు. వీరిపై ఢిల్లీ, జార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, యూపీలో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

Read more