రష్యా సైనికులకు వయాగ్రా
ABN , First Publish Date - 2022-10-17T08:50:02+05:30 IST
ఉక్రెయిన్ మహిళలను అత్యాచారం చేసేందుకు తమ సైనికులకు రష్యా లైంగిక ఉద్దీపన ఔషధం వయాగ్రాను ఇస్తోందని ఐక్యరాజ్య సమితి రాయబారి ప్రమీలా పాటెన్ వ్యాఖ్యానించారు.
కీవ్, అక్టోబరు 16: ఉక్రెయిన్ మహిళలను అత్యాచారం చేసేందుకు తమ సైనికులకు రష్యా లైంగిక ఉద్దీపన ఔషధం వయాగ్రాను ఇస్తోందని ఐక్యరాజ్య సమితి రాయబారి ప్రమీలా పాటెన్ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం వెల్లడించారు. లైంగిక వేధింపులు రష్యా సైనిక వ్యూహంలో ఓ భాగమని వివరించారు. యుద్ధ బాధితులను మరింతగా కుంగదీసే ప్రయత్నం ఇదని అభివర్ణించారు. కాగా, డొనెట్స్క్‌లోని మేయర్ కార్యాలయంపై ఆదివారం ఉక్రెయిన్ క్షిపణి దాడులకు దిగిందని రష్యా ఆరోపించింది. కాగా, యూర్‌పలోని అతిపెద్దదైన అణు ప్లాంట్ ‘జాపోరిజ్జియా’ సమీప ప్రాంతాలపై రష్యా రాకెట్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ప్రత్యారోపణ చేసింది. రష్యా డ్రోన్ దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాల రక్షణకు గగనతల రక్షణ వ్యవస్థలను అందజేయనున్నట్లు ఫ్రాన్స్ ఆదివారం తెలిపింది.