‘హర్‌ ఘర్‌ తిరంగా’లో పాల్గొందాం: వెంకయ్య

ABN , First Publish Date - 2022-08-14T08:43:07+05:30 IST

‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరమూ భాగస్వాములమవుదామని.. ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసి దేశభక్తిని..

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో పాల్గొందాం: వెంకయ్య

న్యూఢిల్లీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరమూ భాగస్వాములమవుదామని.. ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటుకుందామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ‘‘ప్రతీ ఇంటిపై ఎగిరే త్రివర్ణపతాకం మనలో దేశభక్తినే కాకుండా జాతిజనుల మధ్య సోదరభావాన్ని పెంచుతుందని విశ్వసిస్తున్నాను. శక్తిమంతమైన నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి, చిత్తశుద్ధి, నిబద్ధత, కార్యదీక్షలకు త్రివర్ణపతాకం స్ఫూర్తి, ప్రేరణ కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-08-14T08:43:07+05:30 IST