ముగిసిన ఉప రాష్ట్రపతి పర్యటన

ABN , First Publish Date - 2022-05-30T14:48:44+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి రాష్ట్ర పర్యటన ఆదివారంతో ముగిసింది. ఐదు రోజుల పర్యటన కోసం గత బుధవారం చెన్నై వచ్చిన

ముగిసిన ఉప రాష్ట్రపతి పర్యటన

చెన్నై: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి రాష్ట్ర పర్యటన ఆదివారంతో ముగిసింది. ఐదు రోజుల పర్యటన కోసం గత బుధవారం చెన్నై వచ్చిన వెంకయ్య.. శనివారం చెన్నైలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం వెంకయ్య దంపతులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారికి విమానాశ్రయంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, రాష్ట్ర మంత్రులు దురైమురుగన్‌, కె.పొన్ముడి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఇన్బు, డీజీపీ  శైలేంద్రబాబు, లోక్‌సభ సభ్యుడు టీఆర్‌ బాలు తదితరులు సాదరంగా వీడ్కోలు పలికారు.

Read more