Gyanvapi case: శివలింగానికి కార్బన్ డేటింగ్‌పై అక్టోబర్ 11కు తీర్పు వాయిదా

ABN , First Publish Date - 2022-10-07T21:55:34+05:30 IST

జ్ఞానవాపి మసీదు కేసులో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ జరపాలంటూ హిందూ ..

Gyanvapi case: శివలింగానికి కార్బన్ డేటింగ్‌పై అక్టోబర్ 11కు తీర్పు వాయిదా

వారణాసి: జ్ఞానవాపి మసీదు కేసు (Gyanvapi mosque case)లో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ (carbon dating) జరపాలంటూ హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై తీర్పును వారణాసి కోర్టు (varanasi court) అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. దీనికి ముందు జ్ఞానవాపి మసీదు-శృంగార్ గౌర్ కేసులో సెప్టెంబర్ 29న ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ వేసింది. వారణాసి జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష్ తీర్పును వెలువరించాల్సి ఉంది.


కోర్టు ఆదేశాల ప్రకారం ఇటీవల మసీదు ఆవరణలో వీడియో సర్వే జరపగా, అందులో శివలింగం బయటపడిందని హిందూ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అది శివలింగం కాదని, ఫౌంటేన్  అని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో శివలింగానికి కార్బన్  డేటింగ్ జరిపించాలని సెప్టెబర్ 12న హిందూ  వర్గాలు ఒక పిటిషన్ వేశాయి. కార్బన్ డేటింగ్ అనేది శాస్త్రీయ ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా శివలింగం ఏకాలం నాటితో తెలుసుకునే అవకాశం ఉంటుందని హిందూ వర్గాలు, పురావస్తు శాఖ సైతం డిమాండ్ చేస్తున్నాయి. దీనిని జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ అంజుమన్ ఇంతేజామియా వ్యతిరేకించింది. కాగా, దేవతా విగ్రహాల నిత్య పూజకు అనుమతించాలన్న దావా విచారణార్హమని జస్టిస్ ఏకే విశ్వేస్ ఇటీవల స్పష్టం చేశారు.


Updated Date - 2022-10-07T21:55:34+05:30 IST