భగత్‌ సింగ్‌ గ్రామంలో భగవంత్‌ సింగ్‌ బాధ్యతలు

ABN , First Publish Date - 2022-03-15T07:52:47+05:30 IST

దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకాలు వేసే కార్యక్రమం బుధవారం (16వ తేదీ) నుంచి ప్రారంభం..

భగత్‌ సింగ్‌ గ్రామంలో  భగవంత్‌ సింగ్‌ బాధ్యతలు

 పంజాబ్‌ ముఖ్యమంత్రిగా రేపు 

 మాన్‌ ప్రమాణ స్వీకారం

చండీగఢ్‌, మార్చి 14: పంజాబ్‌ సీఎంగా భగవంత్‌ సింగ్‌ మాన్‌ బుధవారం ప్ర మాణ స్వీకారం చేయనున్నా రు. రాజధాని చండీగఢ్‌లో కాకుండా ప్రముఖ స్వాతం త్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ పూర్వీకుల  గ్రామమై న ఖట్కాడ్‌ కలన్‌లో పదవీ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర ప్రజలందర్నీ ఆహ్వానిస్తూ సోమవా రం ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘ఆ రోజు ఒక్క భగవంత్‌ సింగ్‌ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లేదు. మొత్తం 3 కోట్ల పంజాబీ ప్రజలు ముఖ్యమంత్రులు కానున్నారు. అందరం కలిసికట్టుగా షహీద్‌ భగత్‌ సింగ్‌ కలలుగన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. మగవారంతా పసుపచ్చ తలపాగాలు ధరించాలని, మహిళలు అదే రంగు దుప్పట్టా వేసుకొని రావాలని కోరారు. ఆయన సోమవారం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 

బెంగాల్‌ ప్లాన్‌ సిద్ధం చేసిన ఆప్‌

పంజాబ్‌ విజయోత్సాహంతో ఉన్న ఆప్‌ నాయక త్వం పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగా బెంగాల్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరిగే పం చాయతీ ఎన్నికల్లో పాల్గొని, గ్రామ స్థాయిలో ఉనికి చాటుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 2014 నుంచే ఈ పార్టీ ఉన్నా ఇంతవరకు చెప్పుకోదగ్గ ప్రభావం చూపించలేదు. 

Updated Date - 2022-03-15T07:52:47+05:30 IST