12-17 ఏళ్ల పిల్లలకూ ‘కోవోవ్యాక్స్‌’

ABN , First Publish Date - 2022-03-05T07:12:28+05:30 IST

దేశంలోని పిల్లలకు త్వరలోనే మరో కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుంది. దానిపేరే ‘కోవోవ్యాక్స్‌’. 12-17 ఏళ్లలోపు వారికి ఈ టీకాను అత్యవసర ప్రాతిపదికన...

12-17 ఏళ్ల పిల్లలకూ ‘కోవోవ్యాక్స్‌’

న్యూఢిల్లీ, మార్చి 4: దేశంలోని పిల్లలకు త్వరలోనే మరో కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుంది. దానిపేరే ‘కోవోవ్యాక్స్‌’. 12-17 ఏళ్లలోపు వారికి ఈ టీకాను అత్యవసర ప్రాతిపదికన అందించవచ్చంటూ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన ‘విషయ నిపుణుల కమిటీ’ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు సిఫారసు చేసింది. ఈ టీకాను అమెరికా కంపెనీ నోవావ్యాక్స్‌ అభివృద్ధి చేసింది. భారత్‌లో ఉత్పత్తి, మార్కెటింగ్‌ లైసెన్సింగ్‌ను పుణెలోని సీరం కంపెనీ తీసుకుంది. 18 ఏళ్లకు పైబడిన వారిలో కోవోవ్యాక్స్‌ అత్యవసర వినియోగానికి 2021 డిసెంబరు 28నే డీసీజీఐ అనుమతులిచ్చింది. 12-17 ఏళ్లలోపు వారికీ ఈ టీకాను అందించే అవకాశం కల్పించాలంటూ ఫిబ్రవరి 21న ‘సీరం’ సమర్పించిన దరఖాస్తును పరిశీలించిన విషయ నిపుణుల కమిటీ.. అందుకు సానుకూలంగా సిఫారసు చేసింది. 

Updated Date - 2022-03-05T07:12:28+05:30 IST