రేపటి నుంచి కొండ రైలులో జనరల్‌ బోగీ

ABN , First Publish Date - 2022-04-30T14:50:08+05:30 IST

ఊటీ కొండ రైలులో ఆదివారం నుంచి అన్‌రిజర్వ్‌డ్‌ బోగీలు ఏర్పాటుచేయనున్న ట్లు దక్షిణ రైల్వే సేలం డివిజన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. నీలగిరి జిల్లాకు

రేపటి నుంచి కొండ రైలులో జనరల్‌ బోగీ

పెరంబూర్‌(చెన్నై): ఊటీ కొండ రైలులో ఆదివారం నుంచి అన్‌రిజర్వ్‌డ్‌ బోగీలు ఏర్పాటుచేయనున్న ట్లు దక్షిణ రైల్వే సేలం డివిజన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. నీలగిరి జిల్లాకు వచ్చే పర్యాటకులు ఊటీ కొండ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. కున్నూర్‌-ఊటీ మధ్య ప్రతిరోజు నాలుగుసార్లు, కున్నూర్‌-మేట్టుపాళయం మధ్య ఒకసారి కొండ రైలు నడుపుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆ రైలు సేవలు నిలిపివేసిన అధికారులు, కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రారంభించి ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. రిజర్వేషన్‌ విధానం రద్దుచేయాలని, పాత విధానంలో అన్‌రిజర్వ్‌డ్‌ బోగీలు ఏర్పాటుచేయాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో, ఊటీ-కున్నూర్‌ మధ్య నడిచే కొండ రైలులో ఆదివారం నుంచి అన్‌రిజర్వ్‌డ్‌ బోగీ ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-04-30T14:50:08+05:30 IST