హిట్లర్-పుతిన్ కార్టూన్ షేర్ చేసిన ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-02-24T23:45:37+05:30 IST

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను జర్మనీ మాజీ నియంత హిట్లర్ ఓదారుస్తున్నట్లు ఉన్న కార్టూన్‌ను ఉక్రెయిన్ తన ట్విట్ర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ కార్టూన్‌ను షేర్ చేస్తూ ‘‘ఇది మీమ్ కాదు, మీకు సంబంధించిన మాకు సంబంధించిన వాస్తవం’’ అని రష్యాను ఉద్దేశించి రాసుకొచ్చింది..

హిట్లర్-పుతిన్ కార్టూన్ షేర్ చేసిన ఉక్రెయిన్

కీవ్: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను జర్మనీ మాజీ నియంత హిట్లర్ అభినందిస్తున్నట్లు ఉన్న కార్టూన్‌ను ఉక్రెయిన్ తన ట్విట్ర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ కార్టూన్‌ను షేర్ చేస్తూ ‘‘ఇది మీమ్ కాదు, మీకు సంబంధించిన మాకు సంబంధించిన వాస్తవం’’ అని రష్యాను ఉద్దేశించి రాసుకొచ్చింది. దీనికి ముందు రష్యా దండయాత్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రష్యా సైనికులను నాజీలతో పోలుస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ విమర్శలు చేశారు. అధ్యక్షుడి వ్యాఖ్యలకు కొనసాగింపుగా దేశానికి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కార్టూన్ షేర్ అయింది. కాగా, ఈ కార్టూన్‌కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. వాస్తవానికి ఉక్రెయిన్ ట్విట్టర్ ఖాతాకు ఐదు లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నప్పటికీ ఈ కార్టూన్‌కు మాత్రం 5.20 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. రెండు లక్షలకు పైగా రీట్వీట్లు చేశారు. 16 వేలకు పైగా ఈ కార్టూన్‌పై వారి స్పందనలు తెలిపారు. ఇవి ఇంకా కొనసాగుతున్నాయి.Read more