illegal loud speakersను తొలగించాలి...యూపీ సర్కారు ఆదేశాలు
ABN , First Publish Date - 2022-04-26T15:47:27+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లౌడ్ స్పీకర్లపై సంచలన నిర్ణయం తీసుకుంది...

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లౌడ్ స్పీకర్లపై సంచలన నిర్ణయం తీసుకుంది.మతపరమైన ప్రదేశాల్లో అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.చట్టవిరుద్ధమైన లౌడ్స్పీకర్లు, మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ లిమిట్ నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తొలగించేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ హోం శాఖ పోలీసులను ఆదేశించింది.ఏప్రిల్ 30వతేదీలోగా అన్ని స్థలాల జాబితాను తయారు చేసి హోం శాఖకు పంపాలని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లా నుంచి డివిజనల్ కమిషనర్లు నివేదికలను పంపుతారు.మత పెద్దలతో చర్చించిన తర్వాత అన్ని అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగిస్తారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనుమతితో మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించవచ్చని, అయితే ప్రాంగణం నుంచి శబ్దం బయటకు రాకూడదని ఆదేశించారు.
కొత్తగా లౌడ్ స్పీకర్లకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని తెలిపారు.అంతకుముందు ప్రయాగ్రాజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుప్రీంకోర్టు ఆదేశాల మేర రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్ల వాడకంపై నిషేధం ఉండేలా చూడాలని జిల్లా మేజిస్ట్రేట్లను కోరారు.