కేంద్ర బడ్జెట్లో రైతులకు అందించేది ఏమీ లేదు: సీఎం
ABN , First Publish Date - 2022-02-01T23:05:59+05:30 IST
కేంద్ర బడ్జెట్లో రైతులకు అందించేది ఏమీ లేదు: సీఎం

రాయ్‌పూర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్లో రైతులకు అందించేది ఏమీ లేదని సీఎం బఘెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను "దిక్కులేనిది" అని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రైతులు, మహిళలు, యువతకు అందించేది ఏమీ లేదని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల గురించి ఈ బడ్జెట్లో ఏమీ చెప్పలేదని ఆయన అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.