మామ లైంగిక వేధింపుల నుంచి కాపాడండి

ABN , First Publish Date - 2022-06-15T13:28:41+05:30 IST

తన మామ లైంగిక వేధింపుల నుంచి కాపాడాలని ఓ వితంతువు కడలూరు కలెక్టర్‌ ఎదుట మొరపెట్టుకుంది. బాధితురాలి కథనం మేరకు.. కడలూరు

మామ లైంగిక వేధింపుల నుంచి కాపాడండి

                   - కడలూరు కలెక్టర్‌కు మొరపెట్టుకున్న వితంతువు


చెన్నై, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): తన మామ లైంగిక వేధింపుల నుంచి కాపాడాలని ఓ వితంతువు కడలూరు కలెక్టర్‌ ఎదుట మొరపెట్టుకుంది. బాధితురాలి కథనం మేరకు.. కడలూరు సమీపం నత్తంపట్టు ప్రాంతంలో కార్తికేయన్‌, జయంతి (35) దందపుతలు నివసించేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఓ కుమారుడు ఉన్నారు. ఆరు నెలల క్రితం కార్తికేయన్‌ కేన్సర్‌తో మృతి చెందాడు. అప్పటినుంచి జయంతి మామ సుందరమూర్తి ఆమెను లైంగికంగా వేధించసాగాడు. ఈ విషయమై జయంతి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల సుందరమూర్తికి అండగా మాజీ కౌన్సిలర్‌ అండగా నిలిచి జయంతిని బెదరించసాగాడు. దీంతో ఆమె  మంగళవారం ఉదయం తన పిల్లలతో కలిసి కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించి, రక్షణ కల్పించాలని వేడుకుంది. 

Updated Date - 2022-06-15T13:28:41+05:30 IST