కీవ్ వద్ద కూలిపోయిన ఉక్రెయిన్ యుద్ధ విమానం

ABN , First Publish Date - 2022-02-25T00:20:43+05:30 IST

ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సమీపంలో ఆ దేశ యుద్ధ విమానం గురువారం

కీవ్ వద్ద కూలిపోయిన ఉక్రెయిన్ యుద్ధ విమానం

కీవ్ : ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సమీపంలో ఆ దేశ యుద్ధ విమానం గురువారం కూలిపోయింది. ఈ విమానంలో సుమారు 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలనుతెలిపింది. ఈ విమానం కూలిపోవడానికి కారణాలు తెలియడం లేదు. 


ఉక్రెయిన్‌పై రష్యా గురువారం ప్రారంభించిన యుద్ధంలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుండగా తమ దళాలు రష్యా విమానాన్ని లుహాన్‌స్క్ ప్రాంతంలో కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. 


Read more