రష్యా విమానాన్ని కూల్చేసి.. పైలట్‌ను పట్టుకున్న ఉక్రెయిన్ సైన్యం: వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-03-06T02:17:09+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతోంది. క్షిపణులు, ట్యాంకులు వాటి పని అవి

రష్యా విమానాన్ని కూల్చేసి.. పైలట్‌ను పట్టుకున్న ఉక్రెయిన్ సైన్యం: వీడియో వైరల్

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతోంది. క్షిపణులు, ట్యాంకులు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. కదన రంగంలో సైన్యం భీకరంగా పోరాడుతోంది. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్.. ఇరు దేశాల మధ్య తీవ్ర నష్టం వాటిల్లుతోంది.


అయినప్పటికీ యుద్ధం విషయంలో ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా రష్యా విమానాన్ని ఉక్రెయిన్ రక్షణ నిపుణులు కూల్చివేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కూలిపోతున్న విమానాన్ని చూస్తున్న ఉక్రెయిన్ వాసులు కేరింతలతో తమ ఆనందాన్ని తెలియజేస్తుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.


విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్ సైన్యం.. దాని పైలట్‌ను చెర్నిహివ్ శివార్లలో సజీవంగా పట్టుకున్నట్టు తెలిపింది. ఈ ఘటనలో మృతి చెందిన కో పైలట్‌ను మేజర్ క్రివోలాపోవ్‌గా గుర్తించారు. కూలిపోయిన జెట్‌ లోంచి బయటకు వస్తున్న పైలట్‌ వీడియోను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ షేర్ చేసింది. అతడిని క్రస్నోయత్సెవ్‌‌గా గుర్తించినట్టు తెలిపింది.Read more