రష్యా దాడిలో Ukrainian సినీనటి మృతి

ABN , First Publish Date - 2022-03-18T14:47:13+05:30 IST

రష్యా సైనికులు జరిపిన దాడిలో ఉక్రేనియన్ దేశానికి చెందిన ప్రముఖ సినీనటి మరణించారు....

రష్యా దాడిలో Ukrainian సినీనటి మృతి

కైవ్: రష్యా సైనికులు జరిపిన దాడిలో ఉక్రేనియన్ దేశానికి చెందిన ప్రముఖ సినీనటి మరణించారు. కైవ్‌లో రష్యా సైనికులు జరిపిన రాకెట్ దాడిలో ఉక్రేనియన్ నటి ఒక్సానా ష్వెట్స్ మరణించారు. ఒక్సానా ష్వెట్స్ యంగ్ థియేటర్‌కి చెందిన ఒక ప్రముఖ నటి. మరణించే సమయానికి  ఉక్రేనియన్ సినీనటి వయస్సు 67 సంవత్సరాలు.ఒక్సానా ష్వెట్స్ ‘హానర్డ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఉక్రెయిన్’ పేరుతో దేశంలోని అత్యున్నత కళాత్మక గౌరవాన్ని అందుకుంది. మరో వైపు రష్యా సైనికుల చెర నుంచి బయటపడిన మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెరోరోవ్ కు ఆర్డర్ ఫర్ కరేజ్ పేరి డిగ్రీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రదానం చేశారు. మార్చి 11వతేదీన రష్యా సైనికబలగాలకు పట్టుబడిన మేయర్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారు. 


Updated Date - 2022-03-18T14:47:13+05:30 IST