Russian సైనికుల అప్పగింతతో మెలిటోపోల్ మేయర్ విడుదల
ABN , First Publish Date - 2022-03-17T17:14:33+05:30 IST
రష్యా సైనికుల చెరలో ఉన్న మెలిటోపోల్ మేయరును విడుదల చేయించినట్లు ఉక్రెయిన్ దేశం తాజాగా ప్రకటించింది....

కైవ్ (ఉక్రెయిన్): రష్యా సైనికుల చెరలో ఉన్న మెలిటోపోల్ మేయరును విడుదల చేయించినట్లు ఉక్రెయిన్ దేశం తాజాగా ప్రకటించింది. తాము పట్టుకున్న 9మంది రష్యా సైనికులను అప్పగించి మెలిటోపోల్ నగర మేయరు ఇవాన్ ఫెడోరోవ్ను విడుదల చేయించినట్లు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ కార్యాలయం ఇంతకుముందు తెలిపింది.ఫెడోరోవ్ను రష్యా బలగాలు గత శుక్రవారం కిడ్నాప్ చేశాయని ఉక్రెయిన్ తెలిపింది.ఉక్రెయిన్ విడుదల చేసిన రష్యా సైనికులు అందరూ 20 ఏళ్ల వయసులోపు వారేనని, వారంతా పౌరులని ఉక్రెయిన్ తెలిపింది.