Syria: అమెరికా వైమానిక దాడి...ఇద్దరు కీలక ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2022-10-07T13:21:41+05:30 IST

సిరియాలో ఉగ్రవాదులు పాగా వేసిన ఓ గ్రామంపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు అగ్రశ్రేణి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు(ISIS Terrorists) హతమయ్యారు....

Syria: అమెరికా వైమానిక దాడి...ఇద్దరు కీలక ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల హతం

వాషింగ్టన్ (అమెరికా): సిరియాలో ఉగ్రవాదులు పాగా వేసిన ఓ గ్రామంపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు అగ్రశ్రేణి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు(ISIS Terrorists) హతమయ్యారు.సిరియాలోని ఈశాన్య ప్రాంతంలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఒక గ్రామంపై అరుదైన యూఎస్ మిలటరీ హెలికాప్టర్ దాడి (rare U.S. helicopter raid)చేసింది.(US Air Raids) ఉత్తర సిరియాలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అబూ-హషుమ్ అల్-ఉమావి అనే నాయకుడితో సహా ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ సభ్యులను చంపినట్లు యూఎస్ మిలిటరీ(U.S. military) తెలిపింది.సిరియాలోని ఒక గ్రామంపై యూఎస్ హెలికాప్టర్ దాడి తర్వాత స్థానికులు సమ్మె చేశారు. తాము జరిపిన వైమానిక దాడిలో సిరియా పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్(U.S. militarys Central Command) పేర్కొంది.

Read more