జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2022-06-12T07:52:28+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌, పుల్వామా జిల్లాల్లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీస్‌ శాఖ అధికార ప్రతినిధి శనివారం చెప్పారు.

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌, జూన్‌ 11: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌, పుల్వామా జిల్లాల్లో  రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో  ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీస్‌ శాఖ అధికార ప్రతినిధి శనివారం చెప్పారు. కుల్గామ్‌ జిల్లా ఖాందిపొరా ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్‌ చేస్తుండగా.. చాటు నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.  భద్రతా దళం కూడా కాల్పులు జరపడంతో హిజ్బుల్‌ ముజాహిదీన్‌(హెచ్‌ఎం)కు చెందిన  ఉగ్రవాది రసిఖ్‌ అహ్మద్‌ గని మృతి చెందినట్లు తెలిపారు. పుల్వామా జిల్లా ద్రాబ్గమ్‌ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరో ఉగ్రవాది మృతి చెందినట్లు చెప్పారు.  

Read more