Myanmar సరిహద్దుల్లో ఇద్దరు భారతీయుల కాల్చివేత
ABN , First Publish Date - 2022-07-06T12:45:24+05:30 IST
మయన్మార్ (Myanmar) సరిహద్దుల్లో ఇద్దరు భారతీయులను కాల్చిచంపిన ఘటన తాజాగా సంచలనం రేపింది....

మణిపూర్ : మయన్మార్ (Myanmar) సరిహద్దుల్లో ఇద్దరు భారతీయులను కాల్చిచంపిన ఘటన తాజాగా సంచలనం రేపింది. మణిపూర్ సరిహద్దులోని వాయువ్య మయన్మార్‌లోని టము పట్టణంలో ఇద్దరు తమిళియులను కాల్చిచంపినట్లు మయన్మార్ అధికారులు చెప్పారు. పొరుగుదేశమైన మయన్మార్ లో జరిగిన ఈ కాల్పుల ఘటనపై భారత అధికారులు ఆరా తీస్తున్నారు.మయన్మార్ సరిహద్దుల్లో ఇద్దరు భారతీయులను కాల్చిచంపారని వచ్చిన వార్తను ధ్రువీకరించుకునేందుకు తాము మయన్మార్ అధికారులను సంప్రదిస్తున్నామని మణిపూర్ టెంగ్నౌపాల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బి. గో లియన్మాంగ్ చెప్పారు.మయన్మార్ కాల్పుల్లో తమిళులు అయిన పి మోహన్ (28), ఎం అయ్యర్నార్ (35)లు మరణించారని మయన్మార్ వర్గాలు తెలిపాయి.
భారతదేశం, మయన్మార్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ప్రజలు ప్రతిరోజూ ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే అదేరోజు సాయంత్రం 4 గంటలకు తిరిగి వారి వారి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. మొత్తం మీద మయన్మార్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల ఘటనతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.