encounters: జమ్మూకశ్మీరులో రెండు ఎన్‌కౌంటర్లు...నలుగురు ఉగ్రవాదుల మృతి

ABN , First Publish Date - 2022-10-05T15:56:22+05:30 IST

జమ్మూకశ్మీరులో బుధవారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో(encounters) నలుగురు ఉగ్రవాదులు(four terrorists) హతమయ్యారు....

encounters: జమ్మూకశ్మీరులో రెండు ఎన్‌కౌంటర్లు...నలుగురు ఉగ్రవాదుల మృతి

షోపియాన్‌: జమ్మూకశ్మీరులో బుధవారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో(encounters) నలుగురు ఉగ్రవాదులు(four terrorists) హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి.రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది హతమయ్యారు.షోపియాన్‌లోని మూలు ,ద్రాచ్ ప్రాంతాల్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.‘‘షోపియన్‌లోని (Shopian)డ్రాచ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు,భద్రతా దళాలు కాల్పులు జరుపుతున్నాయి’’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు(Kashmir Zone Police) ట్వీట్(tweet) చేశారు. బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. 


కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం జమ్మూ కాశ్మీర్ చేరుకున్న మరుసటి రోజు ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని బాస్కుచాన్ ఇమాంసాహిబ్ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఓ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది హతమార్చారు.

Read more