Twitter: ఢిల్లీ భూప్రకంపనలపై ట్విట్టర్ మీమ్స్ వరద

ABN , First Publish Date - 2022-11-09T10:01:02+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంపై నెటిజన్లు ట్విట్టర్ లో మీమ్స్ పంచుకున్నారు. భూప్రకంపనల అనంతరం ఢిల్లీ వాసులు...

Twitter: ఢిల్లీ భూప్రకంపనలపై ట్విట్టర్ మీమ్స్ వరద
Twitter memes as earthquake

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంపై నెటిజన్లు ట్విట్టర్ లో మీమ్స్ పంచుకున్నారు. భూప్రకంపనల అనంతరం ఢిల్లీ వాసులు(Delhi-NCR) ట్విట్టరులో(Twitter) తమ అనుభవాలను పంచుకున్నారు. భూ ప్రకంపనలతో (earthquake)తెల్లవారుజామున 2 గంటలకే నిద్ర లేచామని నెటిజన్లు వెల్లడించారు.ఇప్పటికే విపరీతమైన వాయు కాలుష్యంతో సతమతమవుతున్న తాము మళ్లీ భూప్రకంపనలను చవి చూశామని ఓ నెటిజన్లు(flooded with memes) పేర్కొన్నారు. ప్రశాంతంగా నిద్రిస్తున్న తమను భూప్రకంపనలు నిద్రా భంగం చేశాయని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. భూప్రకంపనల అనంతరం ఢిల్లీవాసులంతా ఊపిరి పీల్చుకున్నామని మరో నెటిజన్ చెప్పారు. ఢిల్లీని భూ ప్రకంపనలు ఊపేశాయని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-11-09T10:01:04+05:30 IST