ips officers: ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ

ABN , First Publish Date - 2022-10-17T16:39:51+05:30 IST

ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఫణీంధర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. కోయంబత్తూర్‌ నార్త్‌

ips officers: ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ

చెన్నై/ఐసిఎఫ్‌: ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఫణీంధర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. కోయంబత్తూర్‌ నార్త్‌ శాంతిభద్రతల డిప్యూటీ కమిషనర్‌ జీఎస్‌ మాధవన్‌ చెన్నై సైబర్‌ క్రైం సూపరింటెండెంట్‌గాను, ఆ విభాగం ఎస్పీ అశోక్‌కుమార్‌ కోయంబత్తూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌గాను, అదే విభాగానికి చెందిన డిప్యూటీ కమిషనర్‌ మదివానన్‌ కోయంబత్తూర్‌ శాంతిభద్రతల డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. మదురైలో తమిళనాడు ప్రత్యేక బెటాలియన్‌-6 కమాండెంట్‌, సూపరిటెండెంట్‌ స్నేహప్రియ మదురై మండల సివిల్‌ సప్లైస్‌ సీఐడీ ఎస్పీగాను, తిరుప్పూర్‌ డిప్యూటీ కమిషనర్‌ భాస్కరన్‌ మదురై ప్రత్యేక పోలీసు బెటాలియన్‌-6 కమాండెంట్‌, సూపరింటెండెంగ్‌గాను, ఉత్తమపాళయం ఎస్పీ శ్రేయాగుప్తా విలాత్తికుళం సహాయ ఎస్పీగా బదిలీ చేశారు.

Updated Date - 2022-10-17T16:39:51+05:30 IST