Train General Ticket: ట్రైన్‌ జనరల్‌ టికెట్‌.. మరింత ఈజీ!

ABN , First Publish Date - 2022-11-12T03:50:10+05:30 IST

రైల్వే స్టేషన్లలోని జనరల్‌ టికెట్‌ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Train General Ticket: ట్రైన్‌ జనరల్‌ టికెట్‌.. మరింత ఈజీ!

న్యూఢిల్లీ, నవంబరు 11 : రైల్వే స్టేషన్లలోని జనరల్‌ టికెట్‌ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. యూటీఎ్‌స(అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌) యాప్‌లో పలుమార్పులు చేసింది. నాన్‌ సబ్‌ అర్బన్‌ సెక్షన్లలో ఏదైనా స్టేషన్‌కు 20 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయాణికులు జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంటే, ప్రయాణికుడు తాను రైలు ఎక్కాలనుకునే స్టేషన్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడి నుంచైనా యూటీఎస్‌ ద్వారా జనరల్‌ టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. గతంలో ఈ పరిధి ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉండేది. అంతేకాక, సబ్‌ అర్బన్‌(లోకల్‌ రైళ్లు) సర్వీసులకు సంబంధించిన పరిధిని కూడా రెండు నుంచి ఐదు కిలోమీటర్లకు పెంచింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఇప్పటికే అన్ని రైల్వే జోన్లకు పంపించింది.

Updated Date - 2022-11-12T12:22:48+05:30 IST